మరోసారి దేవుడు పాత్రలో పవన్ కళ్యాణ్

Pawan Kalyan to play god role again,Pawan Kalyan,Pawan Kalyan Movies,Pawan Kalyan Latest Movie Updates,Pawan Kalyan to play god role in movie,Pawan Kalyan turns spiritual,Pawan Kalyan To Play God Once Again,Pawan Kalyan Latest Movie Update,Pawan Kalyan as a god in upcoming Moive,Pawan Kalyan Upcoming Moive,Pawan Kalyan upcoming moives 2022,Pawan Kalyan movie updates2022,Pawan Kalyan Movies 2022,Telugu Filmnagar

సూపర్ హిట్ “గోపాల గోపాల “మూవీ లో మోడరన్ శ్రీ కృష్ణుడిగా పవన్ కళ్యాణ్ లుక్ అండ్ పెర్ఫార్మెన్స్ గత సినిమాలకు పూర్తి భిన్నంగా ఉండి ప్రేక్షకులను ఆకట్టుకుంది. పవన్ కళ్యాణ్ ఒక దేవుడి పాత్రలో తన పంచ్ డైలాగ్స్ తో ప్రేక్షకులను అలరించారు. ఒక దేవుడి పాత్రలో పవన్ కళ్యాణ్ పంచ్ డైలాగ్స్ ప్రేక్షకులను బాగా నవ్వించాయి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ మరోసారి దేవుడు పాత్రలో ప్రేక్షకులను అలరించనున్నారని సమాచారం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కోలీవుడ్ నటుడు , దర్శకుడు సముద్రఖని టాలీవుడ్ లో విలన్ గా బిజీ గా ఉన్న విషయం తెలిసిందే. సముద్ర ఖని దర్శకత్వంలో తెరకెక్కిన “వినోధయ సిథం”. తమిళ మూవీ ఘనవిజయం సాధించింది. సముద్రఖనితో పాటు తంబి రామయ్య ప్రధాన పాత్రలలో నటించారు. ఈ సినిమాలో పాత్ర పరంగా తంబి రామయ్య హఠాత్తుగా చనిపోతాడు. పరలోకంలో అడుగుపెట్టిన అతను తనని ఒక మూడు నెలల పాటు బ్రతికించమనీ .. ఈ లోగా బాధ్యతలు తీర్చుకుని వచ్చేస్తానని దేవుడిని కోరడం తో అందుకు దేవుడు అంగీకరించగా , తిరిగి భూమి మీదకి వచ్చిన అతనికి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయనేదే కథ. ఈ కథలోని దేవుడి పాత్రనే పవన్ చేయనున్నారనీ, ఈ రీమేక్ లో సాయితేజ్ కూడా నటించనున్నారనీ , తెలుగు నేటివిటీకి తగినట్టుగా కథలో మార్పులు చేస్తున్నారనీ , సముద్రఖని దర్శకత్వంలోనే ఈ సినిమా రూపొందనుందనీ సమాచారం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × four =