పవర్ స్టార్ పవన్ కళ్యాణ్–క్రిష్ దర్శకత్వంలో వస్తున్న సినిమా హరిహర వీరమల్లు. పీరియాడికల్ స్టోరీ కావడంతో సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. నిజానికి ఈసినిమా ఎప్పుడో పూర్తి కావాల్సి ఉంది కానీ మధ్యలో భీమ్లానాయక్ ను పూర్తి చేయడంతో ఈసినిమా వెనక్కి వెళ్లిపోయింది. కొత్త షెడ్యూల్ ను వచ్చే ఏడాది స్టార్ట్ చేయనున్నట్టు రీసెంట్ గానే క్లారిటీ ఇచ్చాడు క్రిష్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమాలో రాక్ స్టార్ హీరోయిన్ నర్గీస్ ఫక్రీ కూడా నటించబోతుంది. అయితే నర్గీస్ ఫక్రీ జాక్వెలిన్ పాత్రలో నటిస్తున్నట్టు తెలుస్తుంది. హరిహర వీరమల్లు సినిమాలో ఓ కీలక పాత్ర కోసం మొదట జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ను సెలక్ట్ చేశారు. అయితే ఆమె డేట్స్ సర్దుబాటు కాకపోవడంతో మేకర్స్ నర్గీస్ ఫక్రీని సంప్రదించగా నర్గీస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఇక ఈనేపథ్యంలో నర్గీస్ ఫక్రీ తన ఆనందాన్ని పంచుకుంది. సౌత్ సినిమాలో నటిస్తున్నందుకు చాలా ఎగ్జైటింగ్ గా ఉంది.. ఛాలెంజెస్.. ఏదైనా కొత్తగా ఎక్స్పీరియన్స్ చేయాలంటే నాకు చాలా ఇష్టం.. పవన్ తో క్రిష్ తో వర్క్ చేయడానికి ఈగర్ గా వెయిట్ చేస్తున్నా అంటూ తెలిపింది.
కాగా ఈసినిమాలో పవన్ కళ్యాణ్‌కు జోడీగా నిధి అగర్వాల్ నటిస్తుండగా.. అర్జున్ రాంపాల్ కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రముఖ నిర్మాత ఎ.ఎం.రత్నం తన మెగా సూర్యా ప్రొడక్షన్ బ్యానర్‌పై ఈ సినిమాను సమర్పిస్తున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు యం.యం.కీరవాణి సంగీతం అందిస్తుండగా.. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ జ్ఞాన శేఖర్ వి.ఎస్. సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: