స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ ఇప్పుడు వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. రోషన్ ఆండ్రూస్ దర్శకత్వంలో సెల్యూట్ సినిమా తెరకెక్కుతుంది. ఓ మర్డర్ కేసు ఇన్వెస్టిగేషన్ ఆధారంగా ఈసినిమా రూపొందుతుంది. ఈసినిమాలో అరవింద్ కరుణాకరన్ గా కనిపించనున్నాడు. ఇక ఈసినిమా ప్రస్తుతం రిలీజ్ కు సిద్దమవుతూనే మరోపక్క ప్రమోషన్స్ ను కూడా జోరుగా చేస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తాజాాగా ఈసినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు మేకర్స్. ఈసినిమాను జనవరి 14న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్ లో విడుదల చేస్తున్నట్టు మేకర్స్ ప్రకటించారు. మరి పొంగల్ రేసులో పెద్ద సినిమాలు చాలానే ఉన్నాయి. చూద్దాం ఈసినిమా వాటికి ఎంత పోటీ ఇస్తుందో..
Aravind Karunakaran is on a mission!! Salute…releasing in theaters worldwide on January 14, 2022.@DianaPenty @DQsWayfarerFilm
@sreekar_prasad @JxBe #RoshanAndrews #BobbySanjay #salutemovie#manojkjayan #gopalaswamylakshmi #saniyaiyappan #binupappu #alencier #VijayKumar pic.twitter.com/yqqPUofqWD
— Dulquer Salmaan (@dulQuer) December 21, 2021
కాగా ఈసినిమాలో బాలీవుడ్ హీరోయిన్ డయానా పెంటీ హీరోయిన్ గా నటిస్తోంది. ఇంకా ఈసినిమాలో మనోజ్ కె జయన్, సానియా అయ్యప్పన్, సాయి కుమార్, లక్ష్మీ గోపాలస్వామి, విజయ్ కుమార్, గణపతి యస్ పొదువాల్, అలెన్సియర్ లే లోపేజ్, బిను పప్పు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వేఫేరర్ బ్యానర్ పై దుల్కర్ సల్మాన్ స్వయంగా ఈసినిమాను నిర్మిస్తున్నాడు.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: