శ్రీశైలం పోలెమోని నిర్మాతగా నవనీత్ చారి దర్శకత్వంలో సోనీ అగర్వాల్ నటిస్తున్న సస్పెన్స్ థ్రిల్లర్ ‘డిటెక్టివ్ సత్యభామ’. ఈసినిమాకు కూడా రిలీజ్ కు సిద్దమైంది. రీసెంట్ గానే ఈసినిమా నుండి ట్రైలర్ ను రిలీజ్ చేయగా అది అందరినీ ఆకట్టుకొని మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు ఈసినిమా రిలీజ్ డేట్ ను కూడా ఫిక్స్ చేశారు. ఈ నెల డిసెంబర్ 31 న థియేటర్లలో విడుదలవుతుందని ప్రెస్ మీట్ ద్వారా తెలియచేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈ సందర్భంగా సోనీ అగర్వాల్ మాట్లాడుతూ… ‘7జి బృందావన్ కాలనీ’ చిత్రం తర్వాత నాకు అంతగా గొప్పగా పేరు తెచ్చిన సినిమాలు లేవు. మళ్లీ డిటెక్టివ్ సత్యభామ తో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తున్నాను. సెకండ్ ఇన్నింగ్స్ లో అంత క్రేజ్ తెచ్చే మూవీ ఈ డిటెక్టివ్ సత్యభామ అవుతుందన్న నమ్మకం ఉంది. ఈసినిమా పోస్ట్ పొడక్షన్ అంతా ముంబైలో పూర్తి చేసి ఫస్ట్ కాపీ నాకు ముంబయి లో చూపించారు నాకు చాలా బాగా నచ్చింది.. ఈనెల 28 నుండి హైదరాబాద్ లో ఉండి చిత్ర యూనిట్ తో ప్రమోషన్స్ లో పాల్గొంటానని చెప్పారు.
ఇంకా ఈసినిమాలో సోనియా అగర్వాల్ తో పాటు సాయి పంపన, రవివర్మ, సునీత పాండే, రోబో గణేష్, సోనాక్షివర్మ, సంజన, పూజ, బాలు, రెహాన్, భరత్ తదితరులు నటిస్తున్నారు. సిన్మా ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై నవనీత్ చారి దర్శకత్వంలో శ్రీశైలం పోలెమోని నిర్మిస్తున్నారు.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: