ప్రభాస్, పూజాహెగ్డే హీరో హీరోయిన్లుగా రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘రాధేశ్యామ్‘. ఈసినిమా జనవరిలో సంక్రాంతి సందర్భంగా రిలీజ్ కానుంది. దీంతో ప్రమోషన్ కార్యక్రమాలు భారీగానే ప్లాన్ చేశారు. ఇప్పటికే ఈసినిమా నుండి రిలీజ్ చేసిన పాటలు అందరినీ ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం మిలియన్ వ్యూస్ తో దూసుకుపోతున్నాయి. మరోవైపు ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా భారీగానే ప్లాన్ చేశారు. రామోజీ ఫిల్మ్ సిటీలో ఏర్పాట్లు జరుగుతుండగా.. అదే రోజు ఫ్యాన్స్ తో ట్రైలర్ ను రిలీజ్ చేయించనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా ఈసినిమాలో రెబల్ స్టార్ కృష్ణంరాజు కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే కదా. అయితే తాజాగా ఆయనకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ఈసినిమా కృష్ణంరాజు పరమహంస అనే పాత్రలో కనిపించనున్నారు. కాషాయ దుస్తుల్లో.. రుద్రాక్ష పట్టుకొని ఉన్న ఈ లుక్ కూడా ఆకట్టుకుంటుంది.
Introducing The Legendary Actor, Rebel Star Dr. @uvkrishnamraju garu as #Paramahamsa from #RadheShyam.#Prabhas @hegdepooja @director_radhaa @prabhakaranjustin @UV_Creations @TSeries @GopiKrishnaMvs @AAFilmsIndia @RadheShyamFilm #RadheShyamTrailerOnDec23 pic.twitter.com/l294vVnTmf
— UV Creations (@UV_Creations) December 20, 2021
కాగా ఇంకా ఈసినిమాలో సచిన్ ఖేడేకర్, ప్రియదర్శి, రిద్ధి కుమార్, సాషా చెత్రి, కునాల్ రాయ్ కపూర్, భాగ్యశ్రీ తదితరులు ఇందులో కీలక పాత్రలు పోషించారు. తెలుగు, మలయాళం, హిందీ, తమిళ భాషల్లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు సౌత్ లాంగ్వేజస్ కు జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తుండగా.. హిందీలో మిథున్, మనన్ భరద్వాజ్ ద్వయం సంగీత దర్శకులుగా వ్యవహరిస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: