మైత్రీ మూవీ మేకర్స్ , ముత్తంశెట్టి మీడియా బ్యానర్స్ పై సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ , రష్మిక మందన్న జంటగా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలోని యాక్షన్ థ్రిల్లర్“పుష్ప” మూవీ ఫస్ట్ పార్ట్ “పుష్ప: ది రైజ్” డిసెంబర్ 17న భారీ అంచనాలతో , భారీ ఎత్తున రిలీజ్ అయ్యి భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. రఫ్ అండ్ మాస్ అవతార్ లో అల్లు అర్జున్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అల్లు అర్జున్ , రష్మిక ల స్క్రీన్ కెమిస్ట్రీ ప్రేక్షకులను అలరించింది. అల్లు అర్జున్ పెర్ఫార్మెన్స్ , సాంగ్స్ కు ప్రేక్షకులనుండి అద్భుత స్పందన లభిస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
View this post on Instagram
తాజాగా స్టార్ హీరోయిన్ సమంత సోషల్ మీడియా ద్వారా అల్లు అర్జున్ పెర్ఫార్మెన్స్ పై ప్రశంసలు కురిపించారు. ఎవరైనా అద్భుతంగా నటిస్తే వాళ్ల నటన నుంచి స్ఫూర్తి పొందుతాననీ , ఈ సినిమాలో అల్లు అర్జున్ నటనకు ఫిదా అయిపోయాననీ , అల్లు అర్జున్ నుంచి ఎంతో నేర్చుకున్నాననీ , ముఖ్యంగా బన్నీ మ్యానరిజమ్స్ ఈ సినిమాకే హైలెట్ అనీ , భుజాలను పైకి ఎత్తడం దగ్గర్నుంచి.. ప్రతి ఒక్క సీన్ అదిరిపోయిందనీ , నిజంగా ఎంతో ప్రేరణ కలిగించారనీ అంటూ సమంత ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టారు. తను పోస్ట్ చేసిన వెంటనే అల్లు అర్జున్ మీ మనసులో నుంచి వచ్చిన కాంప్లిమెంట్స్‌కు ధన్యవాదాలనీ , మీ మాటలు హృదయాన్ని తాకాయనీ అంటూ రిప్లై ఇచ్చారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: