క్రాక్ : సరస్వతి ఫిలిమ్స్ డివిజన్ బ్యానర్ పై గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ , శృతి హాసన్ జంటగా తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ “క్రాక్ “మూవీ జనవరి 9 తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. హీరోరవితేజ తన బాడీ లాంగ్వేజ్ , డైలాగ్ డెలివరీ తో ప్రేక్షకులను అలరించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఉప్పెన : మైత్రీ మూవీ మేకర్స్ , సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్ పై బుచ్చిబాబు సానా దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్ ,కృతిశెట్టి జంటగా తెరకెక్కిన “ఉప్పెన “మూవీ ఫిబ్రవరి 12వతేది రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి 100కోట్ల క్లబ్ లో చేరింది. వైష్ణవ్ తేజ్ ,కృతిశెట్టి ఈ మూవీతో టాలీవుడ్ కు పరిచయం అయ్యారు.
జాతిరత్నాలు : స్వప్న సినిమా బ్యానర్ పై అనుదీప్ కె వి దర్శకత్వంలో నవీన్ పోలిశెట్టి , ప్రియదర్శి , రాహుల్ రామకృష్ణ , ఫరియా అబ్దుల్లా ప్రధాన పాత్రలలో తెరకెక్కిన కామెడీ ఎంటర్ టైనర్ “జాతిరత్నాలు “మూవీ మార్చి 11 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
వకీల్ సాబ్ : శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ , బే వ్యూ ప్రాజెక్ట్స్ బ్యానర్స్ పై వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , శృతి హాసన్ జంటగా తెరకెక్కిన కోర్ట్ డ్రామా “వకీల్ సాబ్ “మూవీ ఏప్రిల్ 9 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి రికార్డ్ కలెక్షన్ తో 100 కోట్ల క్లబ్ లో చేరింది. లాయర్ గా పవన్ కళ్యాణ్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించారు.
నారప్ప : సురేష్ ప్రొడక్షన్స్ , వి క్రియేషన్స్ బ్యానర్స్ పై శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వెంకటేష్ , ప్రియమణి జంటగా తెరకెక్కిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా “నారప్ప “మూవీ జులై 20 వ తేదీ అమెజాన్ ప్రైమ్ వీడియో ద్వారా రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. వెంకటేష్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.
రాజ రాజ చోర : అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ , పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్స్ పై హాసిత్ గోలి దర్శకత్వంలో శ్రీ విష్ణు , మేఘ ఆకాష్ జంటగా తెరకెక్కిన క్రైమ్ కామెడీ ఎంటర్ టైనర్ “రాజరాజ చోర ” మూవీ ఆగష్టు 19 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. హీరో శ్రీ విష్ణు తన కామెడీ టైమింగ్ , మేఘ ఆకాష్ స్క్రీన్ ప్రెజెన్స్ , గ్లామర్ తో ప్రేక్షకులను అలరించారు.
టక్ జగదీష్ : షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వంలో నాని , రీతూ వర్మ , ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రలలో తెరకెక్కిన యాక్షన్ , ఫ్యామిలీ డ్రామా “టక్ జగదీష్”మూవీ సెప్టెంబర్ 10 వ తేదీ అమెజాన్ ప్రైమ్ వీడియో ద్వారా రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. హీరో నాని తన లుక్స్ , పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.
లవ్ స్టోరి : అమిగోస్ క్రియేషన్స్ , శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్స్ పై ఫీల్ గుడ్ చిత్ర దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగ చైతన్య , సాయి పల్లవి జంటగా తెరకెక్కిన “లవ్ స్టోరి” మూవీ సెప్టెంబర్ 24 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. ఈ మూవీ లో సాయి పల్లవి తన అద్భుతమైన డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను అలరించారు.
మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ : GA 2 పిక్చర్స్ బ్యానర్ పై బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో అఖిల్ అక్కినేని , పూజాహెగ్డే జంటగా తెరకెక్కిన “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్”మూవీ అక్టోబర్ 15 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. అఖిల్ , పూజా ల కెమిస్ట్రీ ప్రేక్షకులను అలరించింది.
అఖండ : ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మాస్ మసాలా చిత్ర దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ , ప్రగ్య జైస్వాల్ జంటగా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ “అఖండ “మూవీ డిసెంబర్ 2 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి రికార్డ్ కలెక్షన్స్ తో 100కోట్ల క్లబ్ లో చేరి దిగ్విజయంగా ప్రదర్శించబడుతుంది.
పుష్ప: మైత్రీ మూవీ మేకర్స్ , ముత్తంశెట్టి మీడియా బ్యానర్స్ పై సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక జంటగా ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యం లో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ పుష్ప మూవీ ఫస్ట్ పార్ట్ “పుష్ప :ది రైజ్” మూవీ డిసెంబర్ 17వ తేదీ రిలీజ్ అయ్యి డివైడ్ టాక్ వచ్చినా భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది.
[totalpoll id=”71772″]
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: