శైలేష్ కొలను దర్శకత్వంలో విశ్వక్ సేన్ హీరోగా వచ్చిన సినిమా హిట్. క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో వచ్చిన ఈసినిమా సూపర్ హిట్ అయింది. ఇక ఈసినిమాకు సీక్వెల్ కూడా వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇటీవలే ఈసినిమా కూడా సెట్స్ పైకి వచ్చి షూటింగ్ ను జరుపుకుంటుంది. ఈసారి ‘హిట్ 2’ సినిమా ఆంధ్ర బ్యాక్‌డ్రాప్‌లో సాగే క్రైమ్ డ్రామాగా.. హీరో పేరు కూడా కె.డి అని ఇప్పటికే చెప్పేశారు కూడా మేకర్స్. అయితే ఫస్ట్ పార్ట్ లో విశ్వక్ సేన్ హీరోగా నటించినా.. ఈ పార్ట్ లో మాత్రం యంగ్ హీరో అడివి శేష్ నటిస్తున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక నేడు అడివి శేష్ పుట్టినరోజు సందర్భంగా తన సినిమాల నుండి అప్ డేట్స్ రాగా ఇప్పుడు ఈసినిమా నుండి కూడా అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. ఈసినిమా నుండి అడివి శేష్ ఫస్ట్ గ్లింప్స్ ను రిలీజ్ చేశారు.
He’s a Cool Cop 😎
He’s never gonna stop 🤘Presenting @AdiviSesh as KD From #HIT2 🔥
▶️ https://t.co/PDIYxuty4F#HBDSeshAdivi ♥@NameisNani @KolanuSailesh @PrashantiTipirn #Meenakshichaudhary @maniDop @Garrybh88 #JohnStewartEduri @ManishaADutt @SVR4446 pic.twitter.com/8ghcRCZCyu
— Wall Poster Cinema (@walpostercinema) December 17, 2021
కాగా ఈసినిమాలో హీరోయిన్‌గా మీనాక్షి చౌదరి నటించనుంది. నాని స్వంత ప్రొడక్షన్ హౌస్ వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై నాని ఈసినిమాను నిర్మిస్తున్నారు. మణికందన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి జాన్ స్టీవర్ట్ ఎడురి సంగీతాన్ని అందించనున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: