‘ఆర్ఆర్ఆర్’.. న్యాచురల్ గా ఎన్టీఆర్ డబ్బింగ్..!

Jr NTR Dubs In Hindi In His Own Voice First Time For Rajamoulis RRR Movie,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,RRR,RRR Movie,RRR Telugu Movie,RRR Telugu Movie Latest News,RRR Telugu Movie Updates,RRR Update,RRR Updates,RRR Movie Upate,RRR Movie Updates,RRR Movie Latest Updates,RRR Latest Updates,RRR Movie News,Ram Charan,Ram Charan Movies,Ram Charan RRR,Jr NTR,Jr NTR Movies,Jr NTR New Movie,Jr NTR Latest Movie,Jr NTR RRR,Jr NTR RRR Movie,Jr NTR Upcoming Movie,Jr NTR RRR Hindi Dubbing,RRR Release Date,Jr NTR RRR Hindi Dubbing,Jr NTR RRR Movie Hindi Dubbing,Alluri Sitaramaraju,Komaram Bheem,Olivia Morrison,Shriya Saran,Samuthirakani,SS Rajamouli,SS Rajamouli Movies,RRR Movie Hindi Dubbing,RRR Hindi Dubbing,Jr NTR Dubs In Hindi With His Own Voice For RRR,Jr NTR Dubs In Hindi For The First Time For Ss Rajamouli's RRR,Jr NTR Dubs In Hindi For The First Time For RRR,Jr NTR Dubs In Hindi In His Own Voice For First Time For RRR,NTR Jr Dubs In Hindi In His Own Voice For First Time,Jr NTR Lends His Own Voice In Hindi For Komaram Bheem In Ss Rajamouli's RRR,RRR Trailer,RRR Movie Trailer,RRR Telugu Trailer,RRR Teaser,RRR Song,RRR Hingi Movie,Jr NTR Dubs In Hindi,Jr NTR Dubs In Hindi For RRR,Jr NTR Dubs In Hindi In His Own Voice,Jr NTR Dubs In Hindi In His Own Voice For RRR Movie,Jr NTR Lends His Own Voice In Hindi For Komaram Bheem,Jr NTR Latest Pic,Jr NTR Latest Photo,Jr NTR Dubbing Photo,#RRROnJan7th,#RRRMovie,#RRR,#JrNTR

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎలాంటి పాత్ర అయినా.. ఎలాంటి ఎమోషన్ అయినా సరే చాలా ఈజీగా చేసేస్తాడు. ఇక ఎన్టీఆర్ వాక్చాతుర్యం గురించి కూడా అందరికీ తెలుసు. ఎన్టీఆర్ తో నటించిన వాళ్లు ఎవరైనా సరే ఆ విషయంలో ఎన్టీఆర్ ను పొగడకుండా ఉండలేరు. ఎన్ని పేజీల డైలాగ్స్ అయినా సరే ఒకే ఒక్క షాట్ లో ఓకే చేస్తాడని అందరూ భయపడుతుంటారు కూడా. అంతేకాదు భాషపై తనకు చాలా పట్టు ఉంటుంది. చాలా స్పష్టంగా మాట్లాడగలిగే హీరోల్లో ఎన్టీఆర్ ఎప్పుడూ ముందుంటాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇదిలా ఉండగా ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈసినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ కానున్న నేపథ్యంలో ప్రమోషన్స్ తో తీరిక లేకుండా ఉన్నారు.
తెలుగు,తమిళ,కన్నడ,మలయాళ, హిందీ భాషల్లో రిలీజ్ కాబోతోంది. ఈ ఐదు భాషలు కాక మరో ఐదు భాషల్లో డబ్బింగ్ చేయబడి రిలీజ్ అవుతుంది ఆర్ఆర్ఆర్. అయితే మెయిన్ గా రిలీజ్ అవుతున్న ఐదు భాషల్లో.. నాలుగు భాషలకు ఎన్టీఆర్ సొంతంగా డబ్బింగ్ చెప్పుకున్నాడు. మలయాళంలో మాత్రం వేరే వారిచేత డబ్బింగ్ చెప్పించారు. ఇక ఎన్టీఆర్ కు కూడా ఇదే మొదటిసారి అయినా కూడా తన వాయిస్.. స్పష్టంగా మాట్లాడే టాలెంట్ ఉంది కాబట్టి చాలా సహజంగా డబ్బింగ్ చెప్పాడని అంటున్నారు రాజమౌళి. ఎన్టీఆర్ డబ్బింగ్ ఎలా ఉందో ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ లో చూశాం. మరి ఎన్టీఆర్ డిక్షన్ ను ఎంజాయ్ చేయాలంటే మాత్రం రిలీజ్ వరకూ ఆగాల్సిందే.

కాగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈసినిమాలో ఎన్టీఆర్ కొమురం భీమ్ గా.. రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటించారు. రామ్ చరణ్ కు జంటగా సీత పాత్రలో బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ నటించగా.. ఎన్టీఆర్ కు జంటగా హాలీవుడ్ స్టార్ ఒలీవియా నటించారు. బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్, శ్రియా, సముద్రఖని లాంటి స్టార్స్ నటించగా ఈమూవీని డివివి దానయ్య నిర్మించారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here