సూపర్ స్టార్ మహేష్ బాబును కృష్ణుడిలా చూాడాలి.. ఈమాట అన్నది ఎవరో కాదు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఎన్టీఆర్ హోస్ట్ గా ఎవరు మీలో కోటీశ్వరులు అన్న ప్రోగ్రాం వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇక అలా మొదలైందో లేదో ఈ ఫస్ట్ సీజన్ ముగిసింది. ఇక హోస్ట్ గా ఎన్టీఆర్ కూడా తన వాక్చాతుర్యంతో షోను సక్సెస్ ఫుల్ గా నడిపాడు. షో లో పాల్గొన్నవారిని ప్రశ్నలు అడగటమే కాదు వారితో సరదాగా మాట్లాడుతూ.. వారి వ్యక్తిగత విషయాలు కూడా అడిగి తెలుసుకునేవారు. గత కొన్ని రోజులుగా విజయవంతంగా ప్రసారమైన తొలి సీజన్ ఆదివారంతో ముగిసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఫైనల్ ఎపిసోడ్‌లో సూపర్‌స్టార్ మహేష్ బాబు పాల్గొని సందడి చేశారు. ఇద్దరు స్టార్ హీరోలు కలిసి బుల్లితెరపై కనిపించడంతో బుల్లి తెర ప్రేక్షకులతో పాటు ఫ్యాన్స్ కూడా పండగ చేసుకున్నారు. ఇక ఎన్టీఆర్ కూడా ఎప్పటిలాగే తమ మాటలతో మహేష్ ను సైతం అటు ఆట ఆడిండమే కాకుండా కాస్త కామెడీ కూడా చేశారు. ఈ నేపథ్యంలో మహేష్ ను పలు ప్రశ్నలు అడిగిన ఎన్టీఆర్.. మహాభారతంలోని పాత్రల్లో ఏ పాత్ర అంటే ఇష్టం..? ఒకవేళ సినిమాగా తెరకెక్కిస్తే ఏ పాత్రలో నటిస్తారని ఎన్టీఆర్ ప్రశ్నించగా.. మహాభారతంలో అన్ని పాత్రలు చాలా కీలకమని, ఎంచుకోవడం కష్టమని సమాధానం ఇచ్చారు. దీంతో ఎన్టీఆర్ స్పందిస్తూ.. శ్రీ కృష్ణుడి అవతారంలో మహేశ్‌బాబు బాగుంటారని అన్నారు. మరి మహేష్ ను ఆ అవతారంలో చూసే అవకాశం ఎప్పుడైనా వస్తుందా చూద్దాం..
ఇక ఇద్దరి సినిమాల విషయానికొస్తే ఎన్టీఆర్ దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో చేసిన ఆర్ఆర్ఆర్ సినిమా సంక్రాంతికి రిలీజ్ కానుంది. ఆర్ఆర్ఆర్ తరువాత ఎన్టీఆర్ కొరటాలతో సినిమా చేయనున్న సంగతి తెలిసిందే కదా. మరోవైపు మహేష్ పరుశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట సినిమా చేస్తున్నాడు. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను జరుపుకుంటుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: