ఒకప్పుడు టాలీవుడ్ లో ఉన్న క్యూట్ పెయిర్ ఎవరంటే నాగ్ చైతన్య-సమంత అని అందరూ చెప్పేవారు. అయితే ఇప్పుడు వారు విడిపోయిన సంగతి తెలిసిందే. ఒక రకంగా అభిమానులకు ఇది చాలా డిజప్పాయింట్ అయ్యే న్యూస్ అయినప్పటికీ.. ఎన్నో రోజులు వార్తల్లో ఈ వ్యవహారం నడిచి వారి మధ్య వచ్చిన కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల ఫైనల్ గా ఇటీవలే విడిపోయినట్టు ప్రకటించారు. ఇక విడిపోయిన తరువాత ఇద్దరూ పెద్దగా దీనిపై ఎక్కడా నోరు విప్పిన దాఖలాలు లేవు. సోషల్ మీడియాకు కూడా చాలా రోజులపాటు దూరంగా ఉన్నారు. ఇక ఇప్పుడిప్పుడే ఆ బాధ నుండి బయటకు వస్తూ ఎవరి పనిలో వారు బిజీ అయిపోతున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక మొదటి సారి తాజాగా ఒక ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సమంత దీనిపై మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలే తెలియచేసింది. లైఫ్ లో మనకు చెడ్డ రోజులు వస్తాయి. వాటిని మనం అర్ధం చేసుకొని యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ చేయలేకపోతే రోజూ దానితో పోరాడాలి. నాగచైతన్యతో విడిపోయినప్పుడు చనిపోతానేమో అనుకున్నా కానీ నా మెంటల్ స్ట్రైంత్ కి థ్యాంక్స్ చెప్పుకోవాలి.. ఒక ఫైటర్ లా ఈసమస్యను ఎదుర్కొన్నా. ఇండస్ట్రీ వల్లే ఇంత స్ట్రాంగ్ అయ్యాను.. నా బెస్ట్ వర్క్ తోనే నన్ను విమర్శించే వాళ్లు సైలెంట్ అవుతారు అంటూ చెప్పుకొచ్చింది.
ప్రస్తుతం సమంత మళ్లీ తన కెరీర్ పై దృష్టి పెట్టింది. ఇప్పటికే దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కించిన ‘శాకుంతలం’ సినిమా త్వరలోనే విడుదలకానుంది. తాజాగా ‘యశోద’ అనే పాన్ ఇండియా చిత్రాన్ని కమిట్ అవ్వగా అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. దానితో పాటు ‘ది అరేంజ్‌మెంట్స్ ఆఫ్ లవ్’ అనే అంతర్జాతీయ చిత్రంలో ఆమె నటించనున్నారు. ఇంకా అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న ‘పుష్ప’ చిత్రంలో స్పెషల్ సాంగ్ లో కనిపించనుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: