దేశవ్యాప్తంగా అందరూ ఎదురుచూస్తున్న సినిమాల్లో ఆర్ఆర్ఆర్ సినిమా కూడా ఒకటి. రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్-రామ్ చరణ్ కాంబినేషన్ లో వస్తున్న మల్టీస్టారర్ ఇది. భారీ అంచనాలతో జనవరి 7న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాకి ప్రమోషనల్ కార్యక్రమాలు వేగవంతం చేశారు. ఇక ఈసినిమా నుండి విడుదలైన పోస్టర్లు, టీజర్, పాటలు ఇప్పటికే సూపర్ హైప్ ను తెచ్చాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా నుండి ట్రైలర్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ కు నిరాశే ఎదురైంది. అదే టైమ్ లో ప్రముఖ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి మరణించడంతో ట్రైలర్ రిలీజ్ డేట్ వాయిదా వేశారు. దీంతో మళ్లీ కొత్త ట్రైలర్ రిలీజ్ డేట్ ను ఎప్పుడు ఇస్తారో అని చూస్తున్నారు. ఈనెల 6న రిలీజ్ చేసే అవకాశం ఉందన్నట్టు వార్తలు కూడా వచ్చాయి. ఇక ఈ వార్తలకు బ్రేక్ వేస్తూ.. ట్రైలర్ కొత్త రిలీజ్ డేట్ ను ప్రకటించారు చిత్రయూనిట్. ఈనెల 9న ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నట్టు అధికారికంగా ప్రకటించారు.
#RRRTrailer out on December 9th. 🤘🏻
Gear up for a massive explosion 💥#RRRTrailerOnDec9th #RRRMovie @ssrajamouli @tarak9999 @AlwaysRamCharan @mmkeeravaani @ajaydevgn @aliaa08 @oliviamorris891 @RRRMovie @DVVMovies pic.twitter.com/OXlpUsQYic
— RRR Movie (@RRRMovie) December 4, 2021
కాగా ఇందులో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గా రామ్ చరణ్, గిరిజన వీరుడు కొమురం భీమ్ పాత్రలో తారక్ నటిస్తున్నారు. ఈ సినిమాతో చరిత్రలో ఎన్నడూ కలవని ఇద్దరూ వీరులను కలిపి ఫిక్షన్ నేపథ్యంలో ఈసినిమాను తెరకెక్కిస్తున్నాడు జక్కన్న. ఇక ఈసినిమాలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ నటిస్తుండగా.. ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ భామ ‘ఒలివియా మోరిస్’ నటిస్తుంది. ఇక ముఖ్యమైన పాత్రల్లో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్, సముద్రఖని, రే స్టీవెన్సన్, ఆలిసన్ డూడి కూడా నటిస్తున్నారు. డీవీవీ ఎంటెర్టైన్మెంట్స్ పతాకం ఫై దానయ్య ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు.



[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: