ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ , ప్రగ్య జైస్వాల్ జంటగా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ “అఖండ“మూవీ ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 2వ తేదీ రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ తో , భారీ వసూళ్లతో దిగ్విజయంగా ప్రదర్శించబడుతుంది. శ్రీకాంత్ , జగపతి బాబు , పూర్ణ ముఖ్య పాత్రలలో నటించారు. హీరో బాలకృష్ణ రెండుపాత్రలలో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. హీరో బాలకృష్ణ , ప్రగ్య జైస్వాల్ కెమిస్ట్రీ ప్రేక్షకులను అలరించింది. దర్శకుడు బోయపాటి అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా “అఖండ”మూవీని తెరకెక్కించి ప్రశంసలు అందుకున్నారు.తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్ సీస్ లో కూడా “అఖండ”మూవీకి అనూహ్య స్పందన లభించింది. “అఖండ”మూవీ సక్సెస్ కు పలువురు సినీ ప్రముఖులు అభినందనలు తెలుపుతూ తమ హర్షం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
హీరో బాలకృష్ణ ఫస్ట్ టైమ్ అఘోర గా నటించిన “అఖండ “మూవీ విశాఖ జిల్లా నర్సీపట్నంలోని బంగార్రాజు థియేటర్‌లో ప్రదర్శించబడుతుంది. ఆ థియేటర్‌లో “అఖండ “మూవీ చూడడానికి వచ్చిన అఘోరాలు సందడి చేశారు. ఈ సినిమా కోసమే థియేటర్‌కు వచ్చామంటూ అఘోరాలు చెప్పారు. బాలయ్య అభిమానులతో కాసేపు ముచ్చటించారు. ఆ తరువాత అఖండ సినిమాను చూసి.. ఆనందించారు. అభిమానులతో కలిసి శివనామస్మరణ చేశారు. తరువాత అక్కడి నుంచి వెళ్లిపోయారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



































