“రొమాంటిక్ “మూవీ తో కేతిక శర్మ టాలీవుడ్ కు కథానాయికగా పరిచయం అయ్యారు. ఆ మూవీ లో కేతిక తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ కేతికకు అవకాశాలొస్తున్నాయి. యంగ్ హీరో నాగశౌర్య , కేతిక శర్మ జంటగా విలు విద్య నేపథ్యంలో తెరకెక్కిన స్పోర్ట్స్ డ్రామా “లక్ష్య ” మూవీ డిసెంబర్ 10 వ తేదీ రిలీజ్ కానుంది. హీరో వైష్ణవ్ కథానాయకుడిగా రూపొందుతున్న మూవీ లో కేతిక కథానాయికగా నటిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
“లక్ష్య ” మూవీ రిలీజ్ సందర్భంగా కేతిక శర్మ శుక్రవారం పాత్రికేయులతో ముచ్చటించారు. కేతిక మాట్లాడుతూ .. ఈ మూవీ లో తన పాత్రపేరు రితిక అనీ , పక్కింటి అమ్మాయి తరహాలో ఉంటుంది. తన మనసుకు నచ్చిన పని చేస్తుంది. నిజజీవితంలో నేనూ అలాగే ఉంటాను. నా మనసుకు నచ్చిందే చేస్తాను. అందుకే నన్ను భరించడం కొంచెం కష్టమేననీ , తనది పూర్తి వైవిధ్యమైన పాత్ర అనీ , తనకు క్రీడలంటే చాలా ఇష్టమనీ , రాష్ట్రస్థాయి స్విమ్మర్‌గా తనకు గుర్తింపు ఉందనీ , క్రీడా నేపథ్య చిత్రాల్లో చాలా ఎమోషన్ ఉంటుందనీ , అవి ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతాయనీ , “లక్ష్య” చిత్రం అందరికి నచ్చుతుందనీ , తనకు భాషా పరమైన హద్దులు ఎలాంటి వి లేవనీ , నటిని కావాలనే తన కల నెరవేరిందనీ , నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలను ఎంపిక చేసుకుని కెరీర్‌ను తీర్చిదిద్దుకుంటాననీ చెప్పారు.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: