సత్యదేవ్-నిత్యమీనన్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా స్కైలాబ్. 1979 లో జరిగిన ఒక యధార్థ సంఘటన ఆధారంగా ఈసినిమా తెరకెక్కించారు. ఇక ఈసినిమా నుండి రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్లు సినిమాపై అంచనాలు పెంచేశాయి. ఇక ఈరోజు ఈసినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈసినిమా ఎలా ఉందో తెలియాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
నటీనటులు.. సత్యదేవ్, నిత్య మీనన్, రాహుల్ రామకృష్ణ, తనికెళ్ల భరణి, తులసి, విష్ణు, అనూష తదితరులు
డైరెక్టర్.. విశ్వక్ ఖండేరావు
బ్యానర్స్.. బైట్ ఫీచర్స్, నిత్య మీనన్ కంపెనీ
నిర్మాత..పృథ్వీ పిన్నమరాజు, నిత్య మీనన్
సంగీతం.. ప్రశాంత్ ఆర్ విహారి
సినిమాటోగ్రఫి.. ఆదిత్య జవ్వాది
కథ..
ఆనంద్ (సత్యదేవ్) డాక్టర్. సస్పెండై తన తాతగారి ఊరైన బండ లింగంపల్లికి వచ్చి క్లినిక్ పెట్టుకోవాలని ప్రయత్నిస్తుంటాడు. ఇక బండలింగంపల్లి గ్రామానికి చెందిన జమీందార్ కూతురు గౌరి(నిత్యామీనన్) హైద్రాబాద్ లో ప్రతిబింబం అనే పత్రికలో జర్నలిస్ట్ గా పనిచేస్తుంది. మరోవైపు ఆ ఊరికి సుబేదార్ రామారావు (రాహుల్ రామకృష్ణ) ది మరో కథ. ఒకప్పుడు బాగా బతికిన తన కుటుంబాన్ని కష్టాల్లో నుంచి గట్టెక్కించడం కోసం పోరాటం చేస్తుంటాడు. ఈ క్రమంలో ఆనంద్, రామారావు ఇద్దరూ కలిసి క్లినిక్ పెట్టాలనుకుంటున్నారు. ఇద్దరూ క్లినిక్ ప్రారంభిస్తారో లేదో ఆ వెంటనే ఊళ్లో స్కైలాబ్ పడుతుందనే భయాలు మొదలవుతాయి. దాంతో వాళ్లిద్దరి కథ మొదటికి వస్తుంది. ఇంకోవైపు ఉద్యోగం లేకపోతే తన తండ్రి పెళ్లి చేసేస్తాడేమో అనే భయంలో నిత్యామీనన్ ఉంటుంది. పట్నం నుంచి ఊరికి వచ్చిన గౌరి అక్కడి నుంచే వార్తలు రాయడం మొదలు పెడుతుంది. స్కైలాబ్ సమయంలో గ్రామ ప్రజల జీవితాల్లో ఎలాంటి మార్పులు వచ్చాయి? ఆ సంఘటన కారణంగా గౌరి, డాక్టర్ ఆనంద్, సుభేదార్ జీవితాల్లో ఎలాంటి మలుపులు వచ్చాయి? అనేదే ‘స్కైలాబ్’మిగతా కథ.
కొన్నిసార్లు కొన్ని పుకార్లు ఏ రేంజ్ లో వ్యాప్తి చెందుతాయో మనకు తెలిసిందే. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ యుగాంతం.. యుగాంతం గురించి ఇప్పటికే ఎన్నో పుకార్లు విన్నాం. 2012 లోయుగాంతం వచ్చేస్తోందని అన్నారు. ఇంకా ఇలాంటివి చాలా రూమర్సే వచ్చాయి. ఇక స్కైలాబ్ సినిమా కూడా అలాంటి నేపథ్యంలో వచ్చిన సినిమానే. అయితే ఇది యధార్థ సంఘటన ఆధారంగా తీసిన సినిమా. స్కైలాబ్ అంటే ఏంటో ఇప్పటికే ఒక ఐడియా వచ్చి ఉంటుంది కదా అందరికీ. 1979లో అమెరికా అంతరిక్ష కేంద్రం నుంచి ప్రయోగించి స్కైలాబ్ అనే స్పేస్ షటిల్ 24 వారాల పాటు పనిచేసి తర్వాత అంతరిక్ష కక్ష్య నుంచి భూవాతావరణంలోకి ప్రవేశించింది. దాంతో స్కైలాబ్ స్పేస్ షటిల్ ఎప్పుడు భూమ్మీద పడిపోతుందో అంటూ కొన్ని దేశాలకి చెందిన ప్రజలు భయపడిపోయారు. కానీ అదేమీ జరగలేదు.స్కైలాబ్ శకలాలు హిందూ మహా సముద్రంలో పడటంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ఇదే ఈసినిమాకు మెయిన్ పాయింట్. ఈ పాయింట్ తో తెలంగాణలోని బండలింగంపల్లి గ్రామంలో జరిగిన సన్నివేశాలను ఇతివృత్తంగా తీసుకొని కథ రాసుకున్నాడు డైరెక్టర్. ఆ గ్రామంలో ప్రజలు ఎలా రియాక్ట్ అయ్యారన్న విషయాలకు కామెడీని జోడించి సినిమాను తెరకెక్కించాడు.
డైరెక్టర్ విశ్వక్ చిన్న పాయింట్ నే కాస్త పెద్దదిగా చెప్పాలనుకొని తీసిన సినిమా ఇది. ఫస్టాఫ్ అంతా క్యారక్టర్స్, విలేజ్ ఎట్మాస్మియర్, స్కైలాబ్ పడుతుందనే వార్త చూపించగా.. ఇక సెకండాఫ్ లో అసలు కథ మొదలవుతుంది. అప్పుడు ఆ జనం ఎలా రియాక్ట్ అయ్యారు. మెయిన్ లీడ్ క్యారక్టర్స్ ఏం చేసాయి.. ప్రీ క్లైమాక్స్ లో ఎలాగో చనిపోబోతున్నాం కదా అని భావించే వారు తమకు ఉన్న చిన్న చిన్న కోరికలు ఎలా తీర్చుకున్నారు ఎమోషనల్ గా టచ్ చేసారు. ముఖ్యంగా అప్పట్లో మనషుల మధ్య ఉన్న వివక్షను చూపించే ప్రయత్నం బాగుంది.
ఈసినిమాకు ప్లస్ పాయింట్ హీరో హీరోయన్స్. సత్యదేవ్-నిత్యామీనన్ ఇద్దరూ మంచి టాలెంటెడ్ నటులు. ఏ పాత్రలో అయినాఇట్టే ఇమిడిపోగలరు. ఆవిషయాన్ని ఇప్పటికే ఎన్నో సినిమాలతో నిరూపించారు కూడా. ఇక ఈ సినిమాలో కూడా ఎప్పటిలాగే ఇద్దరూ అద్భుతంగా నటించారు. డాక్టర్ ఆనంద్‌గా సత్యదేవ్, జర్నలిస్ట్ గౌరిగా నిత్య అద్భుతంగా నటించారు. చాలా గ్యాప్ తరువాత నిత్యా మీనన్ తెలుగు తెరపై కనిపిస్తుంది. అంతేకాదు ఎంతో నమ్మకంతో ఈసినిమాకు ఒక నిర్మాతగా కూడా మారారు. ఇక నిత్యా కూడా ఒక హీరోయిన్ గా కాకుండా గౌరి అనే పాత్రగా మాత్రమే తెరపై కనిపిస్తారు. ఆమె వాయిస్ కూడా సినిమాకు ప్లస్ అయింది. ఇక రాహుల్ రామకృష్ణ నటనకు వంక పెట్టాల్సిన అవసరంలేదు. సుబేదార్ గా తను కూడా తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. కామెడీ తో పాటు ఎమోషన్ సీన్స్ కూడా రాహుల్ బాగా పండించగలడన్న విషయం మరోసారి ప్రూవ్ చేశాడు. ఇక ఆనంద్ తాతయ్య పాత్రలో తనికెళ్ల భరణి, గౌరి తల్లి పాత్రలో తులసి మరోసారి తమ అనుభవాన్ని చూపించారు. ఇక గౌరి ఇంట్లో పనిచేసే శ్రీను పాత్రలో కొత్త కుర్రాడు విష్ణు బాగా నటించారు. మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు.
ఇక ఈసినిమా గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఏదైనా ఉందంటే సినమాటోగ్రఫి. పీరియాడిక్ సినిమా కాబట్టి అప్పటి వాతావరణం తీసుకురావడం అంటే అన్నింట్లో చాలా జాగ్రత్త పడాలి. డైరెక్టర్ విజన్ కు తగ్గట్టు పల్లె వాతావరణాన్ని అద్భుతంగా తెరపై చూపించాడు ఆదిత్య జవ్వాది. ప్రశాంత్ విహారి మ్యూజిక్ పర్ఫెక్ట్ గా పీరియడ్ సినిమాకు సింక్ అయ్యింది. నిర్మాణ విలువలు బాగున్నాయి.
ఓవరాల్ గా చెప్పాలంటే పీరియాడిక్ సినిమాలు, కాస్త ప్రయోగాత్మక సినిమాలు ఇష్టపడే వారికి ఈసినిమా బాగా నచ్చుతుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: