ఇండియన్ ఫస్ట్ మడ్ రేసింగ్ మూవీ గా పాన్ ఇండియా మూవీ గా “మడ్డీ “మూవీ తెరకెక్కింది. పి కె 7 క్రియేషన్స్ బ్యానర్ పై రోడ్ రేసింగ్ లో అనుభవం ఉన్న ప్రభగల్ దర్శకత్వంలో యువన్ , రిథాన్ కృష్ణ , అనూష సురేష్ , అమిత్ శివదాస్ నాయర్ ప్రధానపాత్రలలో మడ్ రేసింగ్ నేపథ్యం లో తెరకెక్కిన “మడ్డీ ” మూవీ తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో డిసెంబర్ 10 వ తేదీ రిలీజ్ కానుంది. రవి బస్రూర్ సంగీతం అందించారు. తెలుగు భాషలో “మడ్డీ “మూవీని శ్రీ వెంకటేశ్వర ఫిలిమ్స్ సంస్థ ద్వారా మెగా ప్రొడ్యూసర్ దిల్ రాజు భారీగా రిలీజ్ చేస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
తాజాగా మేకర్స్ “మడ్డీ ” మూవీ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఈ మూవీలోని క్యారెక్టర్స్ ను పరిచయం చేస్తూ , అద్భుతమైన విజువల్స్ తో రూపొందిన ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. మడ్ రేస్ సన్నివేశాలు ఇంప్రెస్ చేశాయి. మూవీ పై ఆసక్తికలిగించేలా ట్రైలర్ రూపొందింది. ఈ మూవీ ప్రేక్షకులకు ఒక కొత్త ఎక్స్ పీరియన్స్ ను అందించనుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: