రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా రాధేశ్యామ్. యూరప్ నేపథ్యంలో పీరియాడిక్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్నఈసినిమాలో విక్రమాదిత్య పాత్రలో ప్రభాస్ నటిస్తుండగా.. ప్రేరణ పాత్రలో పూజా నటిస్తుంది. మొత్తానికి చాలా గ్యాప్ తరువాత ప్రభాస్ సినిమా రిలీజ్ అవుతుండటంతో అభిమానులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక జనవరి 14న ఈ సినిమా రిలీజ్ అవుతుండటంతో చిత్రయూనిట్ గట్టిగానే ప్రమోషన్స్ చేస్తుంది. దీనిలో భాగంగానే పాటలు ఒక్కొక్కటిగా రిలీజ్ చేసుకుంటూ వెళుతున్నారు. ఇప్పటికే ‘ఈ రాతలే’ అంటూ రిలీజ్ అయిన పాట మిలియన్ వ్యూస్ తో దూసుకుపోతుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇప్పుడు ఈ ప్రమోషన్‌లో భాగంగా ఈసినిమాలోని నగుమోము అనే వీడియో సాంగ్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. ఈ పాటను కృష్ణకాంత్ రాశారు. తెలుగు, తమిళం భాషల్లో సిద్ శ్రీరామ్ పాడగా, కన్నడ, మలయాళ భాషల్లో సౌరాజ్ సంతోష్ పాడారు. హిందీ సాంగ్‌ను ఆర్జిత్ సింగ్ ఆలపించారు. ఇక ఈపాటకు ముందు వచ్చే డైలాగ్స్ కూడా బాగా ఆకట్టుకుంటున్నాయి. “నువ్వేమైనా రోమియో అనుకుంటున్నావా” అని హీరోయిన్ పశ్నించగా, “ఛ.. నేను ఆ టైప్ కాదు..” అని హీరో చెబుతున్నాడు.
“కానీ, నేను జూలియట్‌ను. నాతో ప్రేమలో పడితే చస్తావు” అని పూజ అనడం దానికి “ఐ జస్ట్ వాంట్ ఫ్లర్టేషన్ షిప్ అంటూ బుగ్గపై హీరో ముద్దుపట్టే” సన్నివేశం బాగుంది.
Finally the wait is over, #LoveAnthem of the year is here 💕 #RadheShyam #NagumomuThaarale: https://t.co/1AYEOvTZDi#ThiraiyoaduThoorigai: https://t.co/2tuJpF3o0M#NaguvanthaThaareye: https://t.co/PbFnXqUhuB#MalaroduSaayame: https://t.co/3wF2qoNQt0 pic.twitter.com/mBHHMpGd5t
— UV Creations (@UV_Creations) December 2, 2021
కాగా ఇంకా ఈ సినిమాలో భాగ్య శ్రీ, మురళీ శర్మ, ప్రియదర్శి, కునాల్ రాయ్ కపూర్, కృష్ణంరాజు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను గోపికృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. తెలుగు, మలయాళం, హిందీ, తమిళ భాషల్లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు సౌత్ లాంగ్వేజస్ కు జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తుండగా.. హిందీలో మిథున్, మనన్ భరద్వాజ్ ద్వయం సంగీత దర్శకులుగా వ్యవహరిస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: