శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై భారీ తమిళ చిత్ర దర్శకుడు శంకర్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , కియారా అద్వానీ జంటగా “#RC15” మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. హీరో రామ్ చరణ్ యువ ఐఏఎస్ గా ఒక డైనమిక్ రోల్ లో నటిస్తున్న ఈ మూవీ హీరో రామ్ చరణ్ 15 వ మూవీ , శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై 50 వ మూవీ గా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది. పూణే లో జరిగిన ఫస్ట్ షెడ్యూల్ లో రామ్ చరణ్ , కియారా అద్వానీ లపై భారీ బడ్జెట్ తో ఒక సాంగ్ ను తెరకెక్కించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
“#RC15” మూవీ సెకండ్ షెడ్యూల్ హైదరాబాద్ లో మేకర్స్ ప్లాన్ చేశారు. ఒక ల్యావిష్ సెట్లో జానీ మాస్టర్ కొరియోగ్రఫీ లో విదేశాలకు చెందిన ఎనభై మంది గ్రూప్ డ్యాన్సర్స్ తో ఒక భారీ సాంగ్ ను , భారీ బడ్జెట్ తో ట్రైన్ బ్యాక్ డ్రాప్ లో ఒక మెగా యాక్షన్ ఎపిసోడ్ ను తెరకెక్కించడానికి దర్శకుడు ప్లాన్ చేశారు. డైరెక్టర్ శంకర్ తో వర్కింగ్ ఎక్స్ పీరియన్స్ గురించి రామ్ చరణ్ మాట్లాడుతూ .. డైరెక్టర్ శంకర్ తో వర్క్ చేయడం ఒక గుడ్ ఎక్స్ పీరియన్స్ అనీ , మూవీ ని అద్భుతంగా తెరకెక్కించే విధానానికి నటుడు గా కంటే ఫ్యాన్ బాయ్ గా ఫీల్ అయ్యాననీ , ఆయనతో వర్క్ చేయడం ఆనందంగా ఉందనీ చెప్పారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: