ఊహలు గుసగుసలాడే చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన రాశీ ఖన్నా ప్రస్తుతం తెలుగుతో పాటు ఇతర ఇండస్ట్రీల్లో కూడా వరుస సినిమాలతో బిజీ హీరోయిన్ అయిపోయింది. ప్రస్తుతం రాశీ ఖన్నా యాక్షన్ హీరో గోపీచంద్ హీరోగా మారుతి దర్శకత్వంలో వస్తున్న పక్కా కమర్షియల్ సినిమాలో నటిస్తుంది. ప్రస్తుతం ఈసినిమా రిలీజ్ కు సిద్దమవుతుంది. గతంలో జిల్, ఆక్సీజన్ సినిమాల్లో కలిసి నటించారు గోపీచంద్, రాశీ ఖన్నా. ఇప్పుడు ఈసినిమాలో మరోసారి కలిసి చేస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక నేడు రాశీ ఖన్నా పుట్టిన రోజు సందర్బంగా తన సినిమాలకు సంబంధించిన అప్ డేట్స్ వస్తాయి. దీనిలో భాగంగానే పక్కా కమర్షియల్ సినిమా నుండి రాశీ బర్త్ కు స్పెషల్ గా టీజర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్.
“Pure as angel, Sweet as Love” 🧡🧚♀️
Happy Birthday 💐🎂to our gorgeous & most talented actress @RaashiiKhanna_ – Team #PakkaCommercial #HBDRaashiiKhanna ▶ https://t.co/gNn4KU8j8p#AlluAravind @YoursGopichand @DirectorMaruthi #BunnyVas @JxBe #KarmChawla @SKNonline
— UV Creations (@UV_Creations) November 30, 2021
ఈ సినిమాలో సత్యరాజ్ మరోసారి కీలక పాత్రలో నటిస్తున్నారు. జీఏ2 పిక్చర్స్ – యూవీ క్రియేషన్స్ కలిసి బన్నీవాసు నిర్మాతగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి జకేస్ బీజాయ్ సంగీతాన్ని అందిస్తున్నారు. కరమ్ చావ్లా సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: