మహానటి సినిమా తర్వాత కీర్తిసురేష్ లేడీ ఒరియెంటెడ్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన సంగతి తెలిసిందే. ఇప్పటికే కీర్తి సురేష్ ప్రధాన పాత్రల్లో చేసిన ‘పెంగ్విన్’, మిస్ ఇండియా సినిమాలు ఓటీటీలో రిలీజ్ అయ్యాయి. ఇక ఇప్పుడు మరో సినిమా రిలీజ్ కు సిద్దమవుతుంది. కీర్తిసురేష్ ప్రధాన పాత్రలో స్పోర్ట్స్ నేపథ్యంలో వస్తున్న సినిమా గుడ్ లక్ సఖి. ఈసినిమా కూడా ఈరెండు సినిమాలకు కాస్త అటూ ఇటు గా రిలీజ్ అవ్వాల్సింది కానీ అనుకోని కారణాల వల్ల వాయిదా పడుకుంటూ వచ్చింది. ఇటీవల రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసినా మళ్లీ రెండు మూడుసార్లు మార్చారు. ఫైనల్ గా డిసెంబర్ 10న రిలీజ్ చేయనున్నారు. ఇక ఈసినిమా నుండి ఇప్పటికే పలు పోస్టర్లు, టీజర్ రిలీజ్ అవ్వగా ఇప్పుడు సెన్సార్ కూడా పూర్తి చేసుకుంది. సెన్సార్ బృందం ఈసినిమాకు ఎలాంటి కట్స్ లేకుండా క్లీన్ యూ సర్టిఫికెట్ ఇచ్చారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
#GoodLuckSakhi Censored with Clean “U” Certificate💕
సఖి వచ్చేస్తొంది 📢Get ready to experience the Amazing Story of our Sakhi! 🥳#GoodLuckSakhiOn10thDec@KeerthyOfficial @AadhiOfficial #NageshKukunoor @ThisIsDSP #DilRaju @sudheerbza @shravyavarma pic.twitter.com/ZRcCiAiJNJ
— Telugu FilmNagar (@telugufilmnagar) November 29, 2021
కాగా నగేష్ కుకునూర్ దర్శకత్వం వహిస్తున్న ఈసినిమాలో ఆదిపినిశెట్టి, జగపతిబాబు, రాహుల్ రామకృష్ణ, రమాప్రభ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. వర్త్ ఎ షాట్ మోషన్ ఆర్ట్స్ బ్యానర్‌పై సుధీర్ చంద్ర పాదిరి, శ్రావ్య వర్మ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాను ఒకేసారి తెలుగు, తమిళ, మలయాళం భాషల్లో రూపొందిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందిస్తుండగా.. చిరంతన్ దాస్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నాడు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: