ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ హీరో గా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ “అఖండ“మూవీ డిసెంబర్ 2వ తేదీ రిలీజ్ కానుంది. ప్రగ్య జైస్వాల్ కథానాయిక. థమన్ ఎస్ సంగీతం అందించారు. శ్రీకాంత్ , పూర్ణ , జగపతి బాబు ముఖ్య పాత్రలలో నటించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ ,ట్రైలర్ లకు ప్రేక్షకులనుండి అనూహ్య స్పందన లభించింది. హీరో బాలకృష్ణ రెండు పవర్ ఫుల్ క్యారెక్టర్స్ లో నటించిన “అఖండ ” మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
డిసెంబర్ 1వ తేదీ రాత్రి అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ సహా పలు దేశాల్లో “అఖండ” మూవీ ప్రీమియర్ షోలు ప్లాన్ చేశారు. ముఖ్యంగా ప్రపంచంలోనే పెద్దదైన మెల్‌బోర్న్‌లోని ఐమాక్స్‌లోనూ స్పెషల్ ప్రీమియర్ వేస్తున్నారు. తెలుగు వాళ్లు ఎక్కువగా ఉన్న ఆస్ట్రేలియా దేశంలోనూ బాలయ్య సినిమాలకు మంచి స్పందన వస్తూ ఉంటుందన్న విషయం తెలిసిందే. అందుకే మెల్‌బోర్న్‌లోని ఐమాక్స్‌లో ప్రీమియర్స్ ప్లాన్ చేశారు. ఇక, ఈ షోకు సంబంధించిన బుకింగ్స్‌ను ఓపెన్ చేయగా, గంటల్లోనే టికెట్స్ అన్నీ బుక్ అయ్యాయని సమాచారం.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: