‘బంగార్రాజు’ టీజర్ రిలీజ్

Bangarraju Movie Teaser Is Out Now,Telugu Filmnagar,Latest Telugu Movie News,Telugu Film Updates 2021,Tollywood Movie News,Tollywood Film Updates,Bangarraju,Bangarraju Movie,Bangarraju Telugu Movie,Bangarraju Teaser,Bangarraju Movie Teaser,Bangarraju Telugu Movie Teaser,Latest Telugu Movie Teasers,2021 Telugu Movie Teasers,King Nagarjuna,Naga Chaitanya,Latest Telugu Movies 2021,Akkineni Naga Chaitanya,Chinna Bangarraju,HBD Chay,Naga Chaitanya Movies,Naga Chaitanya New Movie,Naga Chaitanya Latest Movie,Naga Chaitanya New Movie Teaser,Ramya Krishna,Krithi Shetty,Kalyan Krishna,Happy Birthday Naga Chaitanya,Bangarraju First Look,Bangarraju Movie First Look,Bangarraju Movie Updates,Nagarjuna Movies,#HBDNagaChaitanya,#Bangarraju,#BangarrajuTeaser,#HBDChay

కల్యాణ్‌ కృష్ణ దర్శకత్వంలో నాగార్జున ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా బంగార్రాజు. 2016లో వచ్చిన సోగ్గాడే చిన్ని నాయన సీక్వెల్‌గా ఈ బంగార్రాజు రాబోతోన్న సంగతి తెలిసిందే. నిజానికి ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. అయితే తాజాగా పరిస్థితులు మెరుగుపడడంతో చిత్ర యూనిట్‌ శరవేగంగా చిత్రీకరణను పూర్తి చేసే పనిలో పడింది. మరో వైపు ఈసినిమానుండి ఇప్పటికే పలు పోస్టర్లు రిలీజ్ చేసింది చిత్రయూనిట్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా ఈసినిమాలో నాగార్జున తనయుడు నాగచైతన్య కూడా నటిస్తుండడంతో ఈ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఇప్పటికే నాగచైతన్య పుట్టినరోజు సందర్భంగా ఈసినిమా నుండి నిన్న ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. యంగ్ లో ఉన్నప్పుడు నాాగార్జున ఎలా ఉండేవాడు అన్న రోల్ లో చైతు నటిస్తున్నాడు. ఫస్ట్ లుక్ మాత్రం అందరినీ ఆకట్టుకుంటుంది. ఇక తాజాగా ఈసినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేశారు మేకర్స్.

కాగా ఈసినిమాలో నాగార్జునకు జోడీగా రమ్యకృష్ణ నటిస్తుండగా.. నాగచైతన్యకు జోడిగా కృతి శెట్టి నటిస్తోంది. ఇంకా ఈసినిమాలో చలపతి రావు, రావు రమేష్, బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్, ఝాన్సీ, మోనాల్ గజ్జర్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్, జీ స్టూడియోస్ సంయుక్తంగా ఈసినిమాను నిర్మిస్తుండగా అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నాడు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fourteen − 10 =