రీసెంట్ గా లవ్ స్టోరీ సినిమాతో మరోహిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు నాగ చైతన్య. ప్రస్తుతం అయితే కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో బంగార్రాజు, విక్రమ్ కుమార్ దర్శకత్వంలో థాంక్యూ సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇక నేడు నాగ చైతన్య పుట్టినరోజు కావడంతో ఈరెండు సినిమాల నుండి అప్ డేట్స్ ఇస్తున్నారు మేకర్స్. ఇప్పటికే బంగార్రాజు సినిమా నుండి నిన్న ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేస్తే ఈరోజు ఉదయం టీజర్ రిలీజ్ చేశారు. ఇక ఇప్పుడు థాంక్యూ సినిమా అప్ డేట్ కూడా వచ్చేసింది. ఈసినిమా నుండి చైతన్య ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసింది చిత్రయూనిట్. ఇక సింపుల్ అండ్ స్టైలిష్‌గా ఉన్న చై ఫస్ట్ లుక్ అందరినీ ఆకట్టుకుంటుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
Here’s a glimpse wishing @chay_akkineni, a Very Happy Birthday!https://t.co/LgLgMN4fI8#HBDYuvasamratNagaChaitanya#ThankYouMovie@chay_akkineni @RaashiiKhanna_@Vikram_K_Kumar @MusicThaman @pcsreeram @BvsRavi #MalavikaNair @avika_n_joy @SaiSushanthR @SVC_official @adityamusic pic.twitter.com/OiNuIG6X17
— Sri Venkateswara Creations (@SVC_official) November 23, 2021
కాగా ఈసినిమాలో రాశీఖన్నా హీరోయిన్ గా నటిస్తుంది. టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ మూవీని నిర్మిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నాడు. పీసీ శ్రీరామ్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు. మరి ‘మనం’ వంటి క్లాసిక్ తెరకెక్కించిన విక్రమ్ కుమార్ దర్శకత్వంలో నాగ చైతన్య మరోసారి నటిస్తున్నాడు. మరి ఈ సినిమాతో మరో హిట్ కొడతారేమో చూద్దాం..
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: