డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో తెరకెక్కిస్తున్న పీరియాడికల్ యాక్షన్ డ్రామా “రౌద్రం రణం రుధిరం ” మూవీ 2022 జనవరి 7వ తేదీ భారీ అంచనాలతో రిలీజ్ కానుంది. ఈ మూవీ లో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు గా, ఎన్టీఆర్ కొమురం భీమ్ గా నటించారు. రామ్ చరణ్ కు జోడీగా అలియా భట్, ఎన్టీఆర్ కు జోడీగా ఒలీవియా మోరిస్ నటించారు. అజయ్ దేవగన్ , సముద్ర ఖని ముఖ్య పాత్రలలో నటించారు. కీరవాణి సంగీతం అందించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
“రౌద్రం రణం రుధిరం”మూవీ వర్కింగ్ ఎక్స్ పీరియన్స్ గురించి మాట్లాడుతూ .. ఈ మూవీ 2018 నవంబర్ లో ప్రారంభం అయిందనీ , తన పాత్రకై మెంటల్ గా , ఫిజికల్ గా ప్రిపేర్ కావాల్సివచ్చిందనీ , కరోనా కారణంగా షూటింగ్ పలు దఫాలుగా వాయిదా పడిందనీ ,”నాటు నాటు “సాంగ్ కరోనా కారణంగా ఉక్రెయిన్ లో చిత్రీకరించబడిందనీ , ఈ సాంగ్ కు తాను , రామ్ చరణ్ పర్ ఫెక్ట్ సింక్ తో మ్యాచింగ్ స్టెప్స్ వేశామనీ , డ్యాన్స్ సింక్ కావడానికి 15 నుంచి 18 టేక్స్ తీసుకొనేవారమనీ , రామ్ చరణ్ , తనది డ్యాన్స్ సింక్ అయ్యేలా డైరెక్టర్ రాజమౌళి చాలా కష్టపడ్డారనీ , ఈ సాంగ్ ను ఆన్ లైన్ లో చూశాననీ, ప్రతీ ఒక్కరూ డ్యాన్స్ సింక్ గురించే కామెంట్ చేస్తున్నారనీ , సోషల్ మీడియా లో వైరల్ గా మారిందనీ , రాజమౌళి వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ డైరెక్టర్ ఇన్ ఇండియా అనీ , అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేలా “RRR” మూవీ ని తెరకెక్కించారనీ , రాజమౌళి పై ఎన్టీఆర్ ప్రశంసలు కురిపించారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: