సూపర్ హిట్ “ఏ మాయ చేసావె ” మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన సమంత టాలీవుడ్ , కోలీవుడ్ లలో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుని స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మైథలాజికల్ మూవీ “శాకుంతలం ”షూటింగ్ ను సమంత కంప్లీట్ చేశారు.సమంత ప్రస్తుతం “కాతు వాకుల రెండు కాదల్ “తమిళ మూవీ లో నటిస్తున్నారు. “పుష్ప “మూవీ లో ఒక స్పెషల్ సాంగ్ కు సమంత గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై తెరకెక్కనున్న ఒక మూవీ , ఒక ద్విభాషా చిత్రానికి సమంత గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.కెరీర్ మీదే ఫుల్ ఫోకస్ పెట్టాలని డిసైడ్ అయిన సమంత వరుస ప్రాజెక్ట్స్ కు సైన్ చేస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
“ఫ్యామిలీ మెన్ సీజన్ 2” వెబ్ సిరీస్ లో సమంత అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి బాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. కొన్ని రోజులుగా బాలీవుడ్ మూవీస్ లో సమంత నటిస్తారనే వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా సమంత మాట్లాడుతూ .. తాను సినిమాల్లో నటించేందుకు ఎప్పుడు కూడా భాష సమస్య కాలేదనీ ,కథ , ఆ కథలోని పాత్ర నచ్చితే భాష ఏదైనా చేసేందుకు సిద్దంగా ఉంటాననీ , తన కు నచ్చే పాత్ర లభించాలే కాని భాష విషయంలో పెద్దగా పట్టింపు లేకుండా ఉంటాననీ , బాలీవుడ్ లో మంచి పాత్రలు.. కథలు వస్తే నటించేందుకు ఎలాంటి అభ్యంతరం లేదంటూ క్లారిటీ ఇచ్చారు. సమంత హీరోయిన్ గా తాప్సి నిర్మాణంలో ఒక బహు భాషా సినిమా రూపొందనున్నట్టు సమాచారం.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: