పరశురామ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వస్తున్న సినిమా సర్కారు వారి పాట. మహేష్ బాబు ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమా ఇది. ఇక గత ఏడాదికి పైగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ప్రస్తుతం చివరి దశ పనుల్లో ఉంది. ఇప్పటికే ఈసినిమా నుండి పలు పోస్టర్లు, బ్లాస్టర్ పేరుతో చిన్న వీడియో రిలీజ్ చేయగా అది ఎన్ని రికార్డులు క్రియేట్ చేసిందో చూశాం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా ఈసినిమాకు థమన్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. నిన్న థమన్ పుట్టిన రోజు సందర్భంగా టాలీవుడ్ హీరోల నుండి బర్త్ డే విషెస్ అందిన సంగతి తెలిసిందే కదా. ఈనేపథ్యంలోనే మహేష్ కూడా థమన్ కు బర్త్ డే విషెస్ అందించారు. ఈ సందర్భంగా మహేష్ ట్వీట్ కు థమన్ రిప్లై ఇస్తూ.. థ్యాంక్యూ బ్రదర్ మీ సినిమాకు మ్యూజిక్ అందించడం అనేది అన్నిటికంటే హై ఇచ్చే విషయం.. సర్కారు వారి పాట సినిమా నా మనసుకు చాలా దగ్గరైన సినిమా లవ్యూ బ్రదర్ అంటూ ట్వీట్ చేశారు.
Dearest brother 🤗 Composing music for U is an all time High for me and our team 🎵🦁 thanks for the lovely wishes dear brother ♥️ #SarkaruVaariPaataMusic & #SSMB28 is very very close to my heart ❤️
Love u brother 🦁🥁❤️ @urstrulyMahesh gaaru https://t.co/lHxRDe4WvL
— thaman S (@MusicThaman) November 17, 2021
కాగా కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. వెన్నెల కిషోర్, సుబ్బరాజు కీలక పాత్రలు పోషిస్తున్నారు. బ్యాంకింగ్ రంగంలో జరిగుతున్న అతిపెద్ద కుంభకోణం నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతోంది. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీయంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లు సంయుక్తంగా ఈసినిమాను నిర్మిస్తున్నాయి. థమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఈసినిమాను ముందు సంక్రాంతి పండుగ సందర్భంగా రిలీజ్ చేయాలనుకున్నారు.. అయితే రీసెంట్ గానే సంక్రాంతి బరి నుండి తప్పుకొని కొత్త రిలీజ్ డేట్ ను ప్రకటించారు. ఏప్రిల్ 1వ తేదీన ఈసినిమాను రిలీజ్ చేయనున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: