జీ స్టూడియోస్ సమర్పణలో బే వ్యూ ప్రాజెక్ట్స్ బ్యానర్ పై హెచ్ వినోద్ దర్శకత్వంలో అజిత్ కుమార్ హీరోగా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ “వాలిమై” మూవీ 2022 సంవత్సరం సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. బాలీవుడ్ బ్యూటీ హ్యూమా ఖురేషి కథానాయిక. అజిత్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్న ఈ మూవీ లో హీరో కార్తికేయ ఒక నెగటివ్ రోల్ లో నటిస్తున్నారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన “వాలిమై” మూవీ ఫస్ట్ లుక్ , మోషన్ పోస్టర్ , ఫస్ట్ సింగిల్ , కార్తికేయ లుక్ , ఫస్ట్ గ్లింప్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
“వాలిమై” మూవీ ప్రమోషన్ లో భాగంగా అజిత్ గురించి కార్తికేయ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ముందుగా అజిత్ “వాలిమై ” సినిమాలో నటించాలంటే చాలా భయం వేసిందనీ , అజిత్ ను కలవక ముందు వరకు కూడా ఒక రకమైన టెన్షన్ లో ఉన్నాననీ , అంత పెద్ద హీరో ముందుకు తాను వెళ్ళినప్పుడు ఎలా ఉండాలి, ఎలా రిసీవ్ చేసుకోవాలి అనే భయం చాలా ఉందనీ , కానీ ఒక్కసారి అజిత్ ను కలిసిన తర్వాత ఆ భయాలన్నీ ఎగిరిపోయాయనీ , ఆకాశమంత స్టార్ డమ్ ఉండి కూడా అంత సింపుల్‌గా ఉండే హీరోను తాను ఎక్కడా చూడలేదనీ , అందుకే అజిత్ సినిమాలో అవకాశం అనగానే కథ కూడా వినకుండా ఓకే చెప్పాననీ , ప్రస్తుతం తమిళం నుంచి కూడా అవకాశాలు బాగానే వస్తున్నాయనీ , అయితే కథ నచ్చితే తప్ప సినిమాలు సెలెక్ట్ చేసుకోననీ కార్తికేయ చెప్పారు.



[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: