బిగ్ బాస్ 5 సీజన్ ఇప్పటికే రెండు నెలలు పూర్తి చేసుకుంది. ఇక ఈసీజన్ లో ఈసారి చాలా మంది మన తెలుగు ప్రేక్షకులకు తెలిసిన వాళ్లనే తీసుకొచ్చారు. ఇంటిలోకి ఎంట్రీ దొరకడం ఎంత కష్టమో అలాగే హౌస్ లో ఉండటం కూడా అంతే కష్టం. ఒక రకంగా బిగ్ బాస్ ఆడించినట్టు ఆడాలి. ముఖ్యంగా నామినేషన్స్ లోకి రాకుండా చూసుకోవాలి. ఇక ఇప్పటివరకూ 9 వారాలు అయిపోగా ఈవారం నామినేషన్ ప్రక్రియ కూడా నిన్నటితో పూర్తయింది. ఈ వారం మానస్, రవి, కాజల్, సిరి, సన్నీ ఐదుగురు నామినేట్ అయ్యారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
అయితే ఇక్కడి వరకూ బాగానే ఉన్నా యాంకర్ రవి మాత్రం ప్రతి నామినేషన్ లో ఉండటం బ్యాడ్ లక్ అని చెప్పొచ్చు. ఇప్పటికే 10 సార్లు నామినేషన్ ప్రక్రియ జరిగితే 8సార్లు నామినేషన్ లోకి వచ్చాడు రవి. నిజానికి ఇది రవికి కాస్త టెన్షన్ పెట్టే విషయమే.అయితే ఉన్న వాళ్లలో క్రేజ్ పరంగా యాంకర్ రవి మిగిలిన వాళ్లకంటే ముందున్నాడు కాబట్టి సరిపోయింది. దీంతో నామినేషన్స్‌లో ఉన్న ఈజీగా బయటపడుతున్నాడు. కానీ ఇంకా ఐదారు వారులు షో జరుగుతుంది కాబట్టి.. ఇంకా టఫ్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా నామినేషన్ లోకి వస్తాడు. అలాంటి టైమ్ లో మాత్రం రవి డేజంర్ జోన్ లోకి వచ్చే అవకాశం ఉంటుంది. ఒక రకంగా రవిని కాస్త గట్టిగానే టార్గెట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. హౌస్ లో ఉన్నవాళ్లతో పాటు వారానికి ఒకసారి వచ్చి హోస్టింగ్ చేసే నాగార్జున కూడా రవి పై సెటైర్లు వేస్తున్నారు. ఇప్పటివరకూ జరిగిన సీజన్లలో రవి వీడియోలు ప్లే చేసినంత ఎవరివి చూపించలేదేమో. నిజానికి ఒయట తను ఉండేలా కామెడీ చేస్తూ.. సెటైర్లు వేస్తూ ఉన్నా హౌస్ మేట్స్ అవి తీసుకోలేకపోవడంతో అందరికీ కార్నర్ అయిపోయాడు. మరి హౌస్ లో ఎంతో కొంత ఎంటర్ టైన్ చేసే వాళ్లలో రవి కూడా ఒకడు. ఇక రవి అభిమానులు కూడా గత 8 వారాల నుండి నాన్ స్టాప్ గా ఓట్స్ వేస్తూ రవిని కాపాడుకునే పనిలోనే ఉన్నారు. షో అయిపోయేంత వరకూ ఫ్యాన్స్ కు మాత్రం ఇది తప్పేలా కనిపించడంలేదు. మరి రవిని నామినేషన్ నుండి కాపాడాలంటే డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో 10 ఓట్లు వేయోచ్చు. ఇంకా 8886658219 నెంబర్ కు 10 మిస్డ్ కాల్స్ ఇవ్వొచ్చు.
Nominated for 8th time 🥺
Our entertainer needs all your love & support ❤️#VoteForAnchorRavi
Please give 10 missed calls to 8886658219
&
Please install & login to Disney + hotstar, search for Bigg Boss Telugu & Cast your 10 votes daily for #Ravi#BiggBossTelugu5 #AnchorRavi pic.twitter.com/UlambnFbJO— Anchor Ravi (@anchorravi_offl) November 9, 2021
[subscribe]




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: