బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో రవితేజ మునుపెన్నడూ లేని విధంగా చాలా స్పీడుమీదున్నాడు. ఈ ఒక్క ఏడాదే ఐదు సినిమాలను తన ఖాతాలో వేసుకున్నాడు. అందులో ఇప్పటికే ఒక సినిమా షూటింగ్ అయింది.. ఇంకా రెండు సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి. రీసెంట్ గానే రవితేజ 70 అలానే 71వ సినిమాకు సంబంధించిన అప్ డేట్ లు వచ్చాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా నేడు రవితేజ 70వ సినిమా టైటిల్ ను అలానే ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. ఇక ముందునుండి అనుకుంటున్నట్టే ఈసినిమాకు రావణాసుర అనే టైటిల్ నే ఫిక్స్ చేశారు. రావణాసురుడికి ఎలాగైతే పది తలలు ఉంటాయో అలానే పది తలలు ఉండేలా ఫస్ట్ లుక్ ను డిజైన్ చేశారు. సింహాసనం పై కూర్చున్న రవితేజ పోస్టర్ ఆకట్టుకుంటుంది. ఇక శ్రీకాంత్ విస్సా కథ అందిస్తున్న ఈసినిమాలో నటించే ఇతర నటీనటులు అలానే సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలోనే తెలియచేయనున్నారు. అభిషేక్ నామా అవుట్ అండ్ అవుట్ యాక్షన్ థ్రిల్లర్ గా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
Excited about this one 😊 #Ravanasura pic.twitter.com/TmMfqgzrJ7
— Ravi Teja (@RaviTeja_offl) November 5, 2021
ఇక రవితేజ చేస్తున్న ఖిలాడి సినిమా రిలీజ్ కు సిద్దమవుతుంది. దానితోపాటు రామారావు- ఆన్ డ్యూటీ, ధమాకా సినిమాలు సెట్స్‌పై ఉన్నాయి. ఈసినిమాలు అయిపోయిన వెంటనే కొత్తసినిమాలను సెట్స్ పైకి తీసుకెళ్లనున్నాడు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: