అక్కినేని అఖిల్ హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో వస్తున్న సినిమా ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్’. ప్రస్తుతం ఈసినిమాపైనే అఖిల్ ఆశలన్నీ పెట్టుకున్నాడు. వరుసగా మూడు సినిమాలు ఫ్లాప్స్ తరువాత అఖిల్ నుండి వస్తున్న సినిమా కావడంతో ఈసినిమా ఎలాంటి టాక్ ను తెచ్చుకుంటుందా అని అటు ఫ్యాన్స్ తో పాటు అక్కినేని ఫ్యామిలీ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈసినిమాను రిలీజ్ డేట్ ను కూడా అక్టోబర్ 8 నుండి అక్టోబర్ 15కు రీసెంట్ గానే మార్చారు. దీంతో ఈసినిమా ప్రమోషన్స్ ను స్టార్ట్ చేసింది చిత్రయూనిట్. దీనిలో భాగంగానే పలు పోస్టర్లు, పాటలు రిలీజ్ చేయగా వాటికి మంచి రెస్పాన్సే వస్తుంది. ఇక తాజాగా ఈసినిమా సెన్సార్ ను కూడా పూర్తి చేసుకొని రిలీజ్ కు సిద్దమైంది. ఈ సినిమాకి సెన్సార్ వారు యూ/ఏ సర్టిఫికెట్ ని అందజేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో పూజాహెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. ఆమని, మురళీశర్మ, వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. గీత ఆర్ట్స్ 2 బ్యానర్ పై బన్నీ వాసు ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఈ సినిమాకు గోపి సుందర్ సంగీతం.. ప్రదీష్ వర్మ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.
[subscribe]




..
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























