సమంత నటన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఏ మాయ చేశావే సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సమంత మొదటి సినిమాలోనే తన నటనతో మెప్పించింది. ఇక అప్పటినుండి ఇప్పటివరకూ తను కెరీర్ పరంగా రోజు రోజుకు దూసుకుపోతుందే తప్పా ఎక్కడా వెనుకడుగు వేసింది లేదు. ఇక పెళ్లైన తరువాత సమంత పూర్తిగా పాత్ర ప్రధానమైన.. లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ తనలోని విభిన్నత చూపిస్తుంది. ఇక స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతున్న సమంత పలు రంగాల్లో కూడా తన సత్తా చాటుతుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇటీవలే ఫ్యామిలీ మెన్ 2 సిరీస్ తో బాలీవుడ్ ప్రేక్షకులకు కూడా దగ్గరైన సంగతి తెలిసిందే. ఈసిరీస్ లో సమంత నటనకు గాను మంచి ప్రశంసలు దక్కాయి. దీంతో సమంతతో సినిమాలు చేయడానికి ముందుకు వస్తున్నారు. ఈనేపథ్యంలో తనకు కూడా సమంతతో నటించాలని ఉందంటున్నాడు ఓ బాలీవుడ్ హీరో ఆ హీరో ఎవరో కాదు షాహిద్ కపూర్.
Totally loved her on the show. Would love to work with her some time. https://t.co/KhFS9BUclH
— Shahid Kapoor (@shahidkapoor) September 27, 2021
ప్రస్తుతం షాహిద్ కపూర్ తెలుగులో సూపర్ హిట్ అయిన జెర్సీ సినిమాను హిందీలో రీమేక్ చేశాడు. ఇక
ఇటీవలే జెర్సీ రిలీజ్ డేట్ ను ప్రకటించిన సంగతి తెలిసిందే. డిసెంబర్ 31న ఈసినిమాను విడుదల చేయబోతోన్నట్టు ప్రకటించారు. ఇక ఇదిలా ఉండగా షాహిద్ కపూర్ తన సినిమాను ప్రమోట్ చేసుకునే భాగంగా ట్విట్టర్‌లో లైవ్ చాట్ చేశాడు. అయితే ఈ చాట్ లో ఓ నెటిజన్.. ఫ్యామిలీ మెన్ సీజన్ 2లో సమంత నటన గురించి చెప్పమని అడుగగా అందుకు షాహిద్.. సమంత చాలా అద్భుతంగా నటించిందని.. తనతో కలిసి నటించాలని ఉందని తెలిపాడు. మరి మొత్తానికి సమంత తన నటనతో బాలీవుడ్ హీరోలను సైతం ఆకట్టుకుంది. చూద్దాం ఫ్యూచర్ లో వీరిద్దరూ కలిసి నటించే అవకాశం దొరుకుతుందేమో…
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: