శ్రీ సిద్దేశ్వర ఎంటర్ ప్రైజెస్ బ్యానర్ పై ఆర్ చంద్రు దర్శకత్వంలో కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర హీరోగా యాక్షన్ ఎంటర్ టైనర్ “కబ్జా”కన్నడ మూవీ తెరకెక్కుతుంది. హీరో ఉపేంద్ర గ్యాంగ్ స్టర్ గా నటిస్తున్న ఈ మూవీ లో మరో కన్నడ స్టార్ హీరో సుదీప్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. “ముకుంద మురారి “మూవీ తో ప్రేక్షకులను అలరించిన ఉపేంద్ర , సుదీప్ మరో సారి “కబ్జా” మూవీ తో కన్నడ ప్రేక్షకులను అలరించనున్నారు. ఈ మూవీ లో ప్రకాష్ రాజ్ , సముద్ర ఖని, డానిష్ అక్తర్ సైఫీ, కబీర్ దుహాన్ సింగ్ , ప్రదీప్ రావత్ నటిస్తున్నారు. రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో తెరకెక్కుతున్న “కబ్జా” మూవీ కన్నడ భాష తో పాటు తెలుగు , తమిళ , మలయాళ, హిందీ , మరాఠీ , బెంగాలీ భాషలలో రిలీజ్ కానుంది. హీరో ఉపేంద్ర బర్త్ డే సందర్భంగా “కబ్జా” మూవీ మోషన్ పోస్టర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. చేతిలో కత్తి పట్టుకుని రౌద్రంతో పక్కా మాస్ అవతారంలో ఉన్న ఉపేంద్ర లుక్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. దీపావళి పండగకు
“కబ్జా” మూవీ టీజర్ రిలీజ్ కానుందని సమాచారం.
[subscribe]




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: