పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం భీమ్లానాయక్ సినిమాతో బిజీగా ఉండగా త్వరలోనే క్రిష్ దర్శకత్వంలో వస్తున్న హరిహర వీరమల్లు అనే సినిమా షూటింగ్ కూడా రీస్టార్ట్ చేయనున్నాడు. ఇక ఈ సినిమాల తరువాత పవన్ హరీష్ శంకర్ తో సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఇంకా ఈసినిమా సెట్స్ పైకి వెళ్లకముందే అప్పుడే టైటిల్ ను దానితో పాటు ఫస్ట్ లుక్ ను కూడా రిలీజ్ చేశారు. ఇక ఈ ఫస్ట్ లుక్ కు ఎంత రెస్పాన్స్ వచ్చిందో చూశాం. అంతేకాకుండా ఈసినిమాకు భవదీయుడు భగత్ సింగ్ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు.. అలాగే పవన్ కోసం సాలిడ్ కథను పూర్తి చేసే పనిలో పడ్డాడు హరీష్ శంకర్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా ఇప్పుడు ఈసినిమాలో నటించే హీరోయిన్ పై ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తుంది. ఈసినిమాలో పూజా హెగ్డే నటించనున్నట్టు చాలా రోజుల నుండి వార్తలు వస్తున్నాయి. ఇక వినిపిస్తున్న వార్తలను బట్టి దాదాపు ఆమెనే ఖరారైనట్టు తెలుస్తుంది. త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందంటున్నారు. చూద్దాం మరి ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే మాత్రం అధికారిక ప్రకటన వచ్చేంత వరకూ ఆగాల్సిందే.
కాగా ఈసినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తోనే నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఇక పూజా హెగ్డే మాత్రం కెరీర్ లో దూసుకుపోతుంది. ఒక పక్క తెలుగు సినిమాలు చేస్తూనే మరోపక్క హిందీ, తమిళ్ లో కూడా వరుస అవకాశాలను సొంతం చేసుకుంటూ టాప్ హీరోయిన్ గా సూపర్ ఫామ్ లో ఉంది.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: