సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ కామెడీ “సర్కారు వారి పాట” మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం లో “#SSMB 28 “మూవీ కి మహేష్ బాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ మహేష్ బాబు మంచి విషయాలకు స్పందిస్తారు. షూటింగ్స్ తో బిజీగా ఉండే మహేష్ బాబు తీరిక సమయాలలో కుటుంబ సభ్యులతో ఎంజాయ్ చేస్తారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
View this post on Instagram
సూపర్ స్టార్ మహేష్ బాబు, నమ్రత దంపతులు వినాయక చవితి పండుగని ఇంట్లో ఘనంగా జరుపు కొని, ఇంటి లోనే నిమజ్జనం కూడా చేశారు. మట్టి వినాయకుడి విగ్రహాన్ని ఇంట్లో ప్రతిష్టించి నిష్టగా పూజలు చేశారు. గణేశుడి విగ్రహాల నిమజ్జనం జలవనరులు కాలుష్యం కాకూడదని హైకోర్టు కూడా తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. ప్రకృతి ప్రేమికులయిన మహేష్ బాబు, నమ్రత పర్యావరణాన్ని కాపాడుతూనే పండగలను భక్తిశ్రద్ధలతో జరుపుకోవచ్చని నిరూపించి అభిమానులకు మంచి సందేశాన్ని ఇచ్చారు. నమ్రత ఒక చిన్న వీడియో గ్లింప్స్ ని ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేయగా అభిమానులను ఆకట్టుకుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: