పూరి కనెక్ట్స్ , ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై పూరి జగన్నాథ్ దర్శకత్వంలో క్రేజీ హీరో విజయ్ దేవరకొండ కథానాయకుడిగా తెలుగు , హిందీ భాషలలో సాలా క్రాస్‌బ్రీడ్ క్యాప్షన్ తో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ “లైగర్“మూవీ సెప్టెంబర్ 9వ తేదీ రిలీజ్ కానుంది.బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే కథానాయిక కాగా రమ్యకృష్ణ , రోనిత్ రాయ్ , అలీ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. మణిశర్మ , తనిష్ బాగ్చి సంగీతం అందిస్తున్నారు. కిక్ బాక్సర్ నటిస్తున్న విజయ్ మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ తీసుకున్నారు. భారీ వర్కవుట్స్ చేసి సిక్స్ ప్యాక్ బాడీతో కంప్లీట్ మేకోవర్ అయ్యారు. “లైగర్”షూటింగ్ 50 శాతం పైగా కంప్లీట్ అయ్యింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన “లైగర్” ఫస్ట్ లుక్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రముఖ నటుడు జాకీచాన్ చిత్రాలకు వర్క్ చేసిన ప్రముఖ హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫర్ ఆండీ లాంగ్ వర్క్ “లైగర్” కోసం యాక్షన్ సీక్వెన్స్ లు డిజైన్ చేయడం విశేషం. వచ్చే వారం “లైగర్” చిత్ర యూనిట్ గోవాకు వెళ్ళనుంది. గోవా లో నెల రోజుల పాటు జరిగే షూటింగ్ షెడ్యూల్ లో యాక్షన్ సన్నివేశాలతో పాటు కొంత టాకీ పార్ట్ చిత్రీకరించడానికి దర్శకుడు పూరి జగన్నాథ్ ప్లాన్ చేశారు. గోవాలో చిత్రీకరణ పూర్తయిన తర్వాత విదేశాల్లో ఒక షెడ్యూల్ చేయనున్నారనీ , విజయ్ దేవరకొండకు, విదేశీ బాక్సర్లకు మధ్య కొన్ని సన్నివేశాలను ఫారిన్ షెడ్యూల్లో తెరకెక్కిస్తారని సమాచారం .
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: