యంగ్ హీరో నిఖిల్ కూడా వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో నిఖిల్ 18 పేజీస్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇక ఈసినిమా నుండి ఇప్పటికే పలు పోస్టర్లు రిలీజ్ అవ్వగా అవి డిఫరెంట్ గా ఉండి ఆకట్టుకున్నాయి. సినిమాపై మరింత ఆసక్తిని పెంచాయి. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై రానున్న ఈ చిత్రాన్ని బన్నీ వాసు నిర్మిస్తున్న ఈసినిమాకు.. సుకుమార్ రైటింగ్స్ నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తోంది. ఈ చిత్రానికి గోపీ సుందర్ సంగీతం అందిస్తున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమాతో పాటు నిఖిల్ చందూ మొండేటి దర్శకత్వంలో కార్తికేయ సినిమా చేస్తున్నాడు. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. అయితే ఈసినిమాను విదేశాల్లో కూడా షూట్ చేయాల్సి ఉంది. అయితే కరోనా వల్ల అక్కడికి వెళ్లలేని పరిస్థితి ఉండటంతో ఇన్ని రోజులు ఇక్కడే షూటింగ్ ను జరిపారు. ఇక ఇప్పుడు ఈ సినిమా చివరి షెడ్యూల్ ను విదేశాల్లో ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది. రెండువారాల పాటు అక్కడ కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించనున్నారట. దాంతో ఈ సినిమా షూటింగు పార్టు పూర్తవనున్నట్టు తెలుస్తుంది..
ఇక ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తుండగా… ప్రముఖ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ కీలక పాత్రలో నటించనున్నాడు. కాగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకం పై నిర్మాతలు టి.జి.విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు కాలభైరవ సంగీతం అందిస్తున్నాడు. ఇక నిఖిల్ కూడా చాలా కాలంగా మంచి హిట్ కోసం చూస్తున్నాడు. మరి ఈసినిమాలతో అయినా మంచి హిట్ ను తన ఖాతాలో వేసుకుంటాడేమో చూద్దాం.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: