రాచకొండ విద్యాసాగర్ దర్శకత్వంలో అవసరాల శ్రీనివాస్ హీరోగా వచ్చిన సినిమా 101 జిల్లాల అందగాడు. రుహాని శర్మ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రాన్ని శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్ పై దిల్ రాజు, శిరీష్, రాజీవ్ రెడ్డి, సాయి బాబు జాగర్లమూడి నిర్మించారు. ఇక ఈ సినిమా నేడు రిలీజ్ అయి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈసినిమా ఎంత వరకూ ఆకట్టుకుందో తెలియాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
నటీనటులు : అవసరాల శ్రీనివాస్, రుహానీ శర్మ, రోహిణి, రాకెట్ రాఘవ తదితరులు
దర్శకత్వం : రాచకొండ విద్యాసాగర్
నిర్మాతలు : శిరీష్, రాజీవ్‌రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి
కథ: అవసరాల శ్రీనివాస్
సంగీతం : శక్తికాంత్ కార్తీక్
కథ..
గొత్తి సత్యనారాయణ (అవసరాల శ్రీనివాస్)కు వంశ పారంపర్యంగా బట్టతల వస్తుంది. దీంతో చాలా బాధపడుతూ ఉంటాడు. బట్టతల ఉంటే ఏ అమ్మాయి ఇష్టపడదని, జీవితంలో తనకు పెళ్లి కూడా కాదని విగ్ పెట్టి కవర్ చేస్తుంటాడు. ఇలా ఇదిలా ఉండగా మరోవైపు తను పని చేసే ఆఫీస్‌లో అంజలి(రుహానీ శర్మ)ని ఇష్టపడతాడు. బట్టతల విషయం తెలియని అంజలి కూడా జీఎస్‌ఎన్‌ని ఇష్టపడుతుంది. ఇలా వారు ప్రేమలో ఉండగా ఒకరోజు అనుకోకుండా సత్యనారాయణ బట్టతల మ్యాటర్ అంజలికి తెలిసిపోతుంది. మరి ఆతర్వాత అంజలి ఏం చేసింది..? బట్టతల ఉన్నా సత్యనారాయణ ప్రేమను ఇష్టపడుతుందా..? సత్యనారాయణ భయపడినట్టే జరిగిందా..? చివరికి వీరి ప్రేమ ఏమైందో తెలియాలంటే మాత్రం సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ..
‘అష్టాచెమ్మా’తో హీరోగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన అవసరాల శ్రీనివాస్ మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. కేవలం నటుడి గానే కాదు ‘ఊహలు గుసగుసలాడే’, ‘జ్యో అచ్యుతానంద’సినిమాలతో దర్శకుడిగా కూడా సక్సెస్ అయ్యాడు. ఇప్పుడు ఈసినిమాతో రచయిత కూడా మారిపోయాడు. సినిమాను చూస్తే రచయితగా కూడా అవసరాల విజయం సాధించాడనిపిస్తుంది. ఒకవైపు ఎమోషన్స్‌ను, మరో వైపు కామెడీని మిక్స్ చేసి కథను చక్కగా రాసుకున్నాడు అవసరాల.ఇక దానికి తగ్గట్టే డైరెక్టర్ రాచకొండ విద్యాసాగర్ కూడా ఎక్కడా బోర్ ఫీల్ కాకుండా గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో సినిమా స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకూ వినోదాత్మకంగా మలిచాడు.
ప్రతి ఒక్కరికి ఏదో ఒక లోపం ఉంటుంది. అయితే చాలా తక్కువ మంది మాత్రమే దాని గురించి ఆలోచించరేమో కానీ.. చాలామంది మాత్రం తమ లోపాలను సమస్యగా భావించి అనుక్షణం అభద్రతా భావానికి లోనవుతుంటారు. ఈసినిమాలో కూడా అదే పాయింట్ ను చూపించారు. బట్టతలతో హీరో బాధపడే సినిమా. అందం అంటే శరీరానికి సంబంధించినది కాదని మనసు సంబంధించినది ఈ సినిమా ద్వారా మరోసారి గుర్తు చేశారు. అందరికి కనెక్ట్ అయ్యే విషయాన్ని.. కాస్త ఫన్నీగా, ఎమోషనల్‌గా తెరపై చూపించాడు దర్శకుడు విద్యాసాగర్.
ఇక బట్టతలతో బాధపడే యువకుడు జీఎస్‌ఎన్ పాత్రలో అవసరాల శ్రీనివాస్ అద్భుతంగా నటించాడు.. తనదైన మేనరిజమ్స్‌తో నవ్విస్తూనే.. ఎమోషనల్ సీన్స్‌ని కూడా అద్భుతంగా పండించాడు. మరోవైపు హీరోయిన్ రుహాని శర్మ కూడా అదే రేంజ్ లో నటించింది. వారి పాత్రల్లో ఒదిగిపోవడంతో సినిమా ఎక్కడా బోర్ కొట్టదు. హీరో తల్లిపాత్రలో రోహిణి ఎప్పటి మాదిరే ఒదిగిపోయింది. మిగతా నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు.
ఇక సాంకేతిక విభాగానికి వస్తే ఈ సినిమాకు మరో ప్రధాన బలం శక్తికాంత్ కార్తీక్ సంగీతం. పాటల సంగతి పక్కన పెడితే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం చాలా బాగా ఇచ్చాడు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.
ఓవరాల్ గా బట్టతల బాధితుడిగా వచ్చిన ఈ 101 జిల్లాల అందగాడు బాగానే ఆకట్టుకుంటాడు. అన్ని వర్గాల వారు చూసే సినిమా. కామెడీ సినిమాలు ఎంజాయ్ చేసే వాళ్లకి ఈసినిమా మరింత నచ్చుతుంది.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: