యంగ్ హీరోలందరూ బాక్సాఫీస్ వద్ద సందడి చేయడానికి రెడీ అయిపోతుంటే.. ఇన్ని రోజులు సైలెంట్ గా ఉన్న అఖిల్ ఫైనల్లీ ఇప్పుడు తన సినిమా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ రిలీజ్ డేట్ ను కూడా ఫిక్స్ చేసుకున్నాడు. నిజానికి ఈసినిమా కంటే వెనుక మొదలైన సినిమాలు కూడా ఇప్పటికే రిలీజ్ కూడా అయ్యాయి. ఈసినిమా రిలీజ్ కు కూడా చాలా బ్రేక్ లే పడ్డాయి. కరోనా వల్ల రెండు మూడు సార్లు రిలీజ్ డేట్ లను వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. ఇక ఇప్పుడు తాజాగా ఈసినిమా రిలీజ్ డేట్ ను అధికారికంగా ప్రకటించారు చిత్రయూనిట్. అక్టోబర్ 8న ఈసినిమా థియేటర్లలో సందడి చేయడానికి రెడీ అయినట్టు చిత్రయూనిట్ తెలిపింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
Bringing out lots of love, laughter & entertainment to you all! 🤩❤
Get ready to meet our #MostEligibleBachelor in theatres from 𝐎𝐜𝐭 𝟖𝐭𝐡 2021.🕺#MEBOnOct8th@AkhilAkkineni8 @hegdepooja @baskifilmz #PradeeshMVarma #BunnyVas #VasuVarma @adityamusic @GA2Official pic.twitter.com/HN0tyOhPxh
— Geetha Arts (@GeethaArts) August 28, 2021
కాగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో. ఆమని, మురళీశర్మ, వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. గీత ఆర్ట్స్ 2 బ్యానర్ పై బన్నీ వాసు ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఈ సినిమాకు గోపి సుందర్ సంగీతం అందిస్తున్నారు.
అక్కినేని నట వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అఖిల్ ఇప్పటి దాకా మూడు సినిమాలు చేశాడు. అయితే ఒక్క సాలిడ్ హిట్ ను కూాడా అందుకోలేకపోయాడు. మరి ఈసినిమాతో అయినా మంటి హిట్ కొట్టి ఫామ్ లోకి వస్తాడేమో చూద్దాం..
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: