సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ కెరీర్ లో ఫస్ట్ టైమ్ పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతున్న పుష్ప్ పై ఎలాంటి ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమా నుండి బన్నీ లుక్ ఎప్పుడైతే రిలీజ్ చేశారో ఆ రోజు నుండి ఈసినిమా అంచనాలు మారిపోయాయి. దానికి తోడు ఇటీవల విడుదల చేసిన టీజర్ కు సూపర్ రెస్పాన్స్ రావడంతో సినిమా పక్కా హిట్ అన్న అభిప్రాయానికి వచ్చేశారు అందరూ. ఇక ఈసినిమా క్యాస్టింగ్ విషయంలో కూడా సుకుమార్ చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. తన పాత్రలకు ఎవరైతే కరెక్ట్ గా సరిపోతారో వారిని ఎంచుకొని అక్కడే సగం సక్సెస్ అయ్యాడు. ఇప్పుడు పుష్ప సినిమాలో విలన్ లుక్ చూస్తే అలానే అనిపిస్తుంది. ఈసినిమాలో మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్ విలన్ పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇక ఇటీవలే ఫహద్ ఈ సినిమా షూటింగ్ లో పాల్గొనగా నేడు తన లుక్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ఇందులో ఆయన భన్వర్ సింగ్ షెకావత్ అనే పోలీస్ అధికారిగా కనిపించనున్నాడు. ఇక ఈ లుక్ లో ఫహద్ చాలా పవర్ ఫుల్ గా కనిపిస్తున్నాడు. మరి చూడాబోతే వీరిద్దరి మధ్య వార్ కూడా చాలా పవర్ ఫుల్ గా ఉండబోతుందని అర్థమవుతుంది. అది తెలియాలంటే మాత్రం సినిమా రిలీజ్ వరకూ వెయిట్ చేయక తప్పదు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
#Pushpa vs BHANWAR SINGH SHEKHAWAT (IPS) 🔥🔥🔥#PushpaTheRise #ThaggedheLe 🤙 pic.twitter.com/MIEGpMF2Sf
— Mythri Movie Makers (@MythriOfficial) August 28, 2021
కాగా ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపొందే ‘పుష్ప’ సినిమాలో లారీ డ్రైవర్ పుష్పరాజ్ గా అల్లు అర్జున్ కనిపించనున్నాడు. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుండగా.. సునీల్, అనసూయ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ మూవీకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఇక ఈసినిమా రెండు పార్ట్ లుగా వస్తున్న నేపథ్యంలో మొదటి భాగాన్ని ఈ ఏడాది క్రిస్మస్‌కు ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: