అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ , పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్స్ పై హాసిత్ గోలి దర్శకత్వంలో శ్రీవిష్ణు , మేఘ ఆకాష్ జంటగా తెరకెక్కిన కామెడీ ఎంటర్ టైనర్ “రాజ రాజ చోర “మూవీ 19 వ తేదీ రిలీజ్ అయ్యి ప్రేక్షకులను ఆకట్టుకుని పాజిటివ్ టాక్ తో సూపర్ హిట్ దిశగా దూసుకుపోతోంది. సునైన , రవి బాబు , తనికెళ్ళ భరణి ముఖ్య పాత్రలలో నటించారు. వివేక్ సాగర్ సంగీతం అందించారు. హీరో శ్రీవిష్ణు డిఫరెంట్ క్యారెక్టర్ లో మంచి కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను అలరించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
“రాజ రాజ చోర ” మూవీ టీమ్ కు మాస్ మహారాజా రవితేజ సోషల్ మీడియా ద్వారా అభినందనలు తెలిపారు. “రాజ రాజ చోర ” మూవీ చూశాననీ , ఎంటర్ టైనింగ్ , ఎమోషనల్ ఫిల్మ్ అనీ , ఫుల్ గా ఎంజాయ్ చేశాననీ , హీరో శ్రీవిష్ణు , దర్శకులది గుడ్ వర్క్ అనీ , మొత్తం టీమ్ కు అభినందనలనీ రవితేజ ట్వీట్ చేశారు. హీరో రవితేజ ట్వీట్ తో “రాజ రాజ చోర ” మూవీపై హైప్ క్రియేట్ అయ్యింది. ఒక హీరో మూవీ ని మరో హీరో అభినందించడం శుభ పరిణామమే.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: