సక్సెస్ ఫుల్ ఫిల్మ్ ప్రొడ్యూసర్ దిల్ రాజు సమర్పణ లో గుణ టీమ్ వర్క్స్ బ్యానర్ పై గుణశేఖర్ దర్శకత్వంలో స్టార్ హీరోయిన్ సమంత , దేవ్ మోహన్ జంటగా మహా భారతం ఆదిపర్వం లోని శకుంతల , దుష్యంతుల ప్రేమ కథ ఆధారంగా మైథలాజికల్ మూవీ “శాకుంతలం ” రూపొందుతున్న విషయం తెలిసిందే. స్టార్ హీరోయిన్ సమంత ఫస్ట్ టైమ్ నటిస్తున్న మైథలాజికల్ మూవీ “శాకుంతలం ” లో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు , అదితి బాలన్ , గౌతమి , కబీర్ బేడీ , అల్లు అర్హ ముఖ్య పాత్రలలోనటిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. తాను టైటిల్‌రోల్‌ని పోషిస్తున్న తాజా చిత్రం “శాకుంతలం” కోసం కఠినమైన ఆరోగ్య నియమాల్ని పాటిస్తూ చక్కటి శిక్షణ తీసుకున్నాననీ , ఈ మూవీ కై ఎప్పుడూ లేని విధంగా కఠినమైన నియమాల్ని పాటించాననీ సమంత చెప్పిన విషయం తెలిసిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
“శాకుంతలం ” మూవీ లో సమంత తన పాత్ర షూటింగ్ పార్ట్ ను కంప్లీట్ చేశారు. ఈ మేరకు చిత్ర యూనిట్ సమంతకు గ్రాండ్‌గా వీడ్కోలు పలికారు. శాకుంతలం సినిమా షూటింగ్ పూర్తి అవ్వడంపై సమంత స్పందించారు. సినిమా షూటింగ్ పూర్తయిందనీ , ఈ చిత్రం తన జీవితాంతం గుర్తుండిపోతోందనీ , గుణ శేఖర్ గారు తనకు గాడ్ ఫాదర్‌లా అయిపోయారనీ , తన కలను నిజం చేసేశారనీ , ఈ రోజు మొత్తానికి గుడ్ బై చెప్పే సమయం వచ్చిందనీ , . గుణ శేఖర్ సర్ మీద తనకు అంతులేని ప్రేమాభిమానాలు , గౌరవం ఏర్పడ్డాయనీ , తన ఊహకందని ప్రపంచాన్ని ఆయన నిర్మించేశారనీ , ఇప్పుడు తనలో ఉన్న ఆ పసితనం, ఆ చిన్నపిల్ల ఎంతో సంబరంతో డ్యాన్సులు వేస్తోందనీ , .థ్యాంక్యూ సర్ అని సమంత ఎమోషనల్ అయ్యారు.



[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: