ఇటీవలే నాంది లాంటి విభిన్నమైన సినిమాతో ప్రేక్షకులను అలరించాడు అల్లరి నరేష్. ఈసినిమాలో తన నటనతో ప్రేక్షకులతో పాటు విమర్శకుల ప్రశంసలు కూడా అందుకున్నాడు. ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ స్టోరీతో వచ్చేస్తున్నాడు. “సభకు నమస్కారం” పేరుతో ఈసినిమా తెరకెక్కుతుంది. ఈ సెటైరికల్ పొలిటికల్ థ్రిల్లర్ కు దర్శకుడు సతీష్ మల్లంపాటి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఈసినిమా నుండి ఇప్పటికే ఒకటి రెండు పోస్టర్లు కూడా రిలీజ్ చేశారు చిత్రయూనిట్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా నేడు ఈసినిమాను గ్రాండ్ లాంఛ్ చేశారు చిత్రయూనిట్. ముహూర్తపు సన్నివేశానికి నరేశ్ కుమార్తె అయాన క్లాప్ కొట్టగా.. `నాంది` డైరెక్టర్ విజయ్ కనకమేడల ముహూర్తపు సన్నివేశానికి గౌరవ దర్శకత్వం వహించారు. అబ్బూరి రవి, అమ్మిరాజు, సుధీర్ స్క్రిప్ట్‌ను చిత్ర దర్శకుడు సతీశ్ మల్లంపాటికి అందించారు. సెప్టెంబర్ నుండి షూటింగ్ ను మొదలుపెట్టనున్నారు.
Allari Naresh @allarinaresh’s #SabhakuNamaskaram formally launched
Clap by Naresh’s daughter #Ayana & First Shot direction by Naandi Director #Vijay
Director: #SatishMallampati
Producer: @smkoneru
DOP: #ChotaKNaidu
Music: @SricharanPakalaShoot Begins this September pic.twitter.com/51SYy690YW
— East Coast Prdctns (@EastCoastPrdns) August 12, 2021
కాగా పొలిటికల్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈసినిమాకు సతీశ్ మల్లంపాటి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈస్ట్ కోస్ట్ బ్యానర్ పై మహేష్ కోనేరు నిర్మిస్తున్న ఈ సినిమాకు అబ్బూరి రవి సంభాషణలు సమకూరుస్తున్నాడు. ఛోటా కె.నాయుడు సినిమాటోగ్రాఫర్‌గా, శ్రీచరణ్ పాకాల మ్యూజిక్ డైరెక్టర్‌గా వర్క్ చేస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: