యంగ్ హీరో నిఖిల్ , అనుపమ పరమేశ్వరన్ జంటగా మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణ లో GA 2 పిక్చర్స్ , సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్ పై పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో “18 పేజెస్ ” మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ కి ప్రముఖ దర్శకుడు సుకుమార్ స్టోరీ , స్క్రీన్ ప్లే అందించడం విశేషం. గోపీసుందర్ సంగీతం అందిస్తున్నారు. జూన్ 1న చిత్ర ఫస్ట్ లుక్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేయగా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
“18 పేజెస్ “మూవీ షూటింగ్ కంప్లీట్ అయ్యింది. డబ్బింగ్ షురూ అయ్యిందని హీరో నిఖిల్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. “18 పేజెస్ “మూవీ డబ్బింగ్ స్టార్ట్ అయ్యిందనీ , స్టూడియో కు రావడం ఆనందంగా ఉందనీ , మూవీ విడుదలకు సిద్ధం అవుతుందని హీరో నిఖిల్ ట్వీట్ చేశారు. ఈ మూవీ తోపాటు హీరో నిఖిల్ “కార్తికేయ 2 “మూవీ లో కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. నిఖిల్ హీరోగా పలు మూవీస్ చర్చల దశలో ఉన్నాయి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: