కెరీర్ ప్రారంభం నుండి కాస్త డిఫరెంట్ సినిమాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ తనకంటూ ఇండస్ట్రీలో ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు శ్రీవిష్ణు. ఇక ఇటీవలే గాలిసంపత్ తో అలరించిన శ్రీవిష్ణు ఇప్పుడు మరో డిఫరెంట్ సినిమాలతో వచ్చేస్తున్నాడు. అందులో రాజ రాజ చోర సినిమా కూడా ఒకటి. ఇక ఈసినిమా షూటింగ్ కూడా పూర్తి చేసుకొని రిలీజ్ కు సిద్దంగా ఉంది. ఇక శ్రీవిష్ణు సినిమా అందులోనూ రీసెంట్ గా రిలీజ్ అయిన టీజర్ కు మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై భారీ అంచనాలే ఏర్పడ్డాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా థియేటర్స్ ఓపెన్ అవ్వడంతో ఈసినిమా రిలీజ్ డేట్ ను కూడా ఫిక్స్ చేశారు మేకర్స్. ఈ నెల 19న థియేటర్స్ లో రాజరాజ చోర సినిమాను విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు పోస్టర్ ని రిలీజ్ చేస్తూ… కింగ్ సైజ్ ఎంటర్టైన్మెంట్ గ్యారెంటీ అంటూ ధీమా కూడా వ్యక్తం చేస్తున్నారు. చూద్దాం మరి ఈ రాజ రాజ చోరుడు ఎంత వరకూ అలరిస్తాడో.
August 19th! Ee Avatharam tho Mimmalni Gattiga Entertain chese poochi naadi😎#RajaRajaChora at you nearest THEATRES FROM AUG19@akash_megha @TheSunainaa @vishwaprasadtg @AbhishekOfficl @vivekkuchibotla @kirthi_chowdary @hasithgoli @peoplemediafcy @AAArtsOfficial#RRCfromAug19 pic.twitter.com/C2w7QnxA0k
— Sree Vishnu (@sreevishnuoffl) August 11, 2021
కాగా హసిత్ గోలి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మేఘా ఆకాశ్ హీరోయిన్‌గా నటిస్తోంది. సునయన ముఖ్యపాత్ర పోషిస్తోంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణ సంస్థపై టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నారు. ఇంకా ఈ సినిమాలో తనికెళ్ళ భరణి, రవిబాబు,కాదంబరి కిరణ్, శ్రీకాంత్ అయ్యంగార్, అజయ్ ఘోష్,వాసు ఇంటూరి తదితరులు నటిస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: