అల్లుడు శ్రీను సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఆ తరువాత పలు సినిమాలు చేసినా సాలిడ్ హిట్ కొట్టింది లేదు. అయితే తమిళ్ లో సూపర్ హిట్ అయిన రాచ్చసన్ సినిమాను తెలుగులో రాక్షసుడు సినిమాగా రీమేక్ చేసి ఆ సినిమాతో కాస్త హిట్ ను సొంతం చేసుకున్నాడు. ఇక ఇప్పుడు బాలీవుడ్ లో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి రెడీ అయిపోయాడు. అది కూడా ఇక్కడ బ్లాక్ బస్టర్ కొట్టిన ఛత్రపతి రీమేక్ తోనే. రాజమౌళి-ప్రభాస్ కాంబినేషన్ లో వచ్చిన ఛత్రపతి సినిమా ను బాలీవుడ్ లో వినాయక్ దర్శకత్వంలో రీమేక్ చేస్తున్నాడు. ఈమధ్య ఈసినిమా సెట్స్ పైకి వెళ్లింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా ఈసినిమా తెలుగులో మరో కొత్త సినిమాతో వచ్చేస్తున్నాడు. 1970 కాలం నాటి టైగర్ నాగేశ్వర్ రావు జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కబోతున్న సినిమాలో బెల్లం కొండ శ్రీనివాస్ నటించబోతున్నాడు. ఇక ఈసినిమాను నేడు అధికారికంగా ప్రకటించారు చిత్రయూనిట్. ఈ సినిమాకి స్టువర్ట్ పురం దొంగ అనే టైటిల్ ని ఫిక్స్ చేశారు. ఈ మేరకు పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. ఈ సినిమాకు కేఎస్ దర్శకత్వం వహిస్తుండగా… మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాను బెల్లంకొండ సురేష్ నిర్మిస్తున్నారు. మరి బెల్లంకొండ శ్రీనివాస్ ఈ సినిమాతో ఎలాంటి హిట్ అందుకుంటాడో చూడాలి.
Here’s the title poster of my next project, #StuartpuramDonga. Really excited to start the shoot for this☺️ pic.twitter.com/jLF7eIP1lu
— Bellamkonda Sreenivas (@BSaiSreenivas) August 11, 2021
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: