“ఫొటో ” మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన అంజలి తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ భాషల పలు సూపర్ హిట్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. “సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు “, “గీతాంజలి “మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి అంజలి బెస్ట్ యాక్ట్రెస్ గా నంది అవార్డ్స్ అందుకున్నారు. అంజలి ప్రస్తుతం “ఆనందభైరవి “, “F 3 “, “పూచండి “(తమిళ ), “శివప్ప “(కన్నడ ) మూవీస్ లో నటిస్తున్నారు. రీసెంట్ గా బ్లాక్ బస్టర్ “వకీల్ సాబ్ “మూవీ లో అంజలి అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. అంజలి ఇప్పుడు ఒక మలయాళ మూవీ తెలుగురీమేక్ లో ఎంపిక అయినట్టు సమాచారం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
గోల్డ్ కాయిన్ మోషన్ పిక్చర్ కంపెనీ , మార్టిన్ ప్రక్కట్ ఫిల్మ్స్ బ్యానర్స్ పై మార్టిన్ ప్రక్కట్ దర్శకత్వంలో కుంచకో బోబన్ , జోజు జార్జ్ , నిమిష సాజయన్ ప్రధాన పాత్రలలో తెరకెక్కిన పొలిటికల్ థ్రిల్లర్ “నాయాట్టు “మలయాళ మూవీ ఘనవిజయం సాధించింది. అల్లు అరవింద్ సమర్పణ లో GA 2 పిక్చర్స్ బ్యానర్ ఫై సక్సెస్ ఫుల్ “పలాస “మూవీఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వంలో “నాయాట్టు “మలయాళ మూవీ తెలుగు రీమేక్ తెరకెక్కనుంది. త్వరలో సెట్స్ పైకి వెళ్ళే ఈ మూవీ లో శ్రీవిష్ణు , రావు రమేష్ , అంజలి ముఖ్య పాత్రలకై ఎంపిక అయినట్టు , రెండు షూటింగ్ షెడ్యూల్స్ తో షూటింగ్ పార్ట్ కంప్లీట్ కానున్నట్టు సమాచారం.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: