చెర్రీ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్‌పై శివ ఏటూరి దర్శకత్వంలో డైలాగ్ కింగ్ సాయికుమార్ ప్రధాన పాత్రలో ఆనంద్, శ్రీ పల్లవి జంటగా తెరకెక్కిన “వన్ బై టు” మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. లియాండర్ లీ మార్టీ , ఆదేశ్ రవి సంగీతం అందించారు. కరణం శ్రీనివాసరావు నిర్మాత. సాయికుమార్ పుట్టినరోజు సందర్భంగా మంగళవారం ‘వన్ బై టు’ చిత్ర టీజర్‌ను చిత్రయూనిట్ విడుదల చేసింది. సాయి కుమార్ పవర్‌ఫుల్ డైలాగ్స్‌తో రూపొందిన టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
‘ఎవరైనా మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తే వాళ్ళను శిక్షించే పవర్ ఫుల్ పాత్రలో సాయికుమార్ నటిస్తున్నారు. అమ్మాయిలపై యాసిడ్ దాడులు మరియు పసిపిల్లలపై అత్యాచారం వంటి సంఘటనలకి పరిష్కారం ఇదే అనేలా సాయికుమార్ పాత్ర ఉంటుంది. ఆడవాళ్ళ జోలికొస్తే తగలెట్టేస్తా, నేను ఎంటరైతే విశ్వరూపమే’ వంటి డైలాగ్స్‌తో ఉన్న ఈ టీజర్ ఆకట్టుకోవడమే కాకుండా ఆసక్తికరంగా ఉంది. “వన్ బై టు “మూవీని తెలుగుతో పాటు కన్నడ, హిందీ డబ్బింగ్ వెర్షన్స్ రిలీజ్ చేస్తామనీ , త్వరలోనే రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తామనీ మేకర్స్ తెలిపారు.
[subscribe]




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: