కె రాఘవేంద్ర రావు దర్శకత్వంలో శ్రీకాంత్ హీరోగా రూపొందిన “పెళ్ళి సందడి “(1996 ) మూవీ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. మ్యూజికల్ బ్లాక్ బస్టర్ గా ప్రేక్షకులను అలరించిన “పెళ్ళి సందడి “మూవీ సీక్వెల్ “పెళ్ళిసందD” మూవీ తెరకెక్కుతుంది. ఆర్కా మీడియా వర్క్స్ సమర్పణలో ఆర్ కె ఫిల్మ్స్ అసోసియేట్స్ బ్యానర్ పై దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు దర్శకత్వ పర్యవేక్షణ లో గౌరి రోణంకి దర్శకత్వంలో హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ , శ్రీలీల జంటగా తెరకెక్కిన “పెళ్ళిసందD” మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
బ్లాక్ బస్టర్ “పెళ్ళిసందడి ” మూవీకి సంగీతం అందించిన కీరవాణి , 25 సంవత్సరాల తరువాత ఆ మూవీ సీక్వెల్“పెళ్ళిసందD” మూవీ కి సంగీతం అందించడం విశేషం. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. దర్శకురాలు గౌరి మాట్లాడుతూ .. “పెళ్ళిసందD” మూవీ బాగా వచ్చిందనీ , రోషన్, శ్రీలీల జోడీ క్యూట్‌గా ఉండి ప్రేక్షకులను ఆకట్టుకుంటుందనీ , కీరవాణి స్వరాలు ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయనీ , త్వరలో టీజర్, ట్రైలర్ విడుదల చేస్తామనీ , అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి సెప్టెంబరులో విడుదల చేయాలని ప్లాన్ చేశామనీ చెప్పారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: