దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్లు హీరోలుగా వస్తున్ భారీ మల్టీస్టారర్ చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్’. స్వాతంత్య్ర సమరయోధులు కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజు పాత్రల ఆధారంగా ఫిక్షన్ నేపథ్యంలో ఈసినిమా తెరకెక్కిస్తున్నాడు రాజమౌళి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ను పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నాడు జక్కన్న. సినిమా రిలీజ్ సంగతి పక్కన పెడితే షూటింగ్ మాత్రం త్వరగా కంప్లీట్ చేసేలా చూస్తున్నాడు రాజమౌళి. అందుకే ఈసారి మాత్రం ఎలాంటి బ్రేక్ లు లేకుండా దాదాపు ఆగష్ట్ కల్లా ఈసినిమా షూటింగ్ ను చేసేలా ప్లాన్ చేశాడు. మరోవైపు కరోనా వల్ల వచ్చిన గ్యాప్ లో ఎన్టీఆర్, చరణ్ డబ్బింగ్ కార్యక్రమాలు మొదలుపెట్టి ఇప్పటికే చాలా వరకూ పూర్తి చేసినట్టు తెలుస్తుంది. ఇక ఈసినిమా నుండి అప్పుడప్పుడు పలు పోస్టర్లు రిలీజ్ చేస్తున్న జక్కన్న తాజాగా రోర్ ఆఫ్ ఆర్ఆర్ఆర్ అంటూ ఈసినిమా మేకింగ్ వీడియోను రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించాడు. ఇక ఈవీడియో కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తుండగా నేడు ఆ వీడియోను రిలీజ్ చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
A glimpse into the making of @RRRMovie… Hope you all love it.:)https://t.co/afM8x6aIOP#RoarOfRRR #RRRMovie @tarak9999 @AlwaysRamCharan @ajaydevgn @aliaa08 @OliviaMorris891 @DVVMovies @PenMovies @LycaProductions
— rajamouli ss (@ssrajamouli) July 15, 2021
ఇక వీడియో చూస్తుంటేనే అర్థమవుతుంది సినిమా ఏ రేంజ్ లో ఉండబోతుందో. ఒక అద్బుతమైన సినిమా బయటకు రావాలంటే దాని వెనుక ఎంత కష్టం ఉంటుందో అన్నది ఆర్ఆర్ఆర్ మేకింగ్ వీడియోను చూస్తే అర్థమవుతుంది. ప్రతి ఒక్క విషయంలో ఎంతో జాగ్రత్త తీసుకునే జక్కన్న ఈసినిమాకు కూడా ముందుగానే ఎంతో గ్రౌండ్ వర్క్ చేసినట్టు తెలుస్తుంది. చరణ్, తారక్‌లకు సంబంధించిన కొన్ని సన్నివేశాల చిత్రీకరణను ఇందులో చూపించారు. భారీ యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌ని సైతం ఈ వీడియో ద్వారా ప్రేక్షకులకు చూపించారు. ఫైనల్ ఎన్నో రోజుల నుండి డౌట్ గా ఉన్న రిలీజ్ విషయంలో కూడా క్లారిటీ ఇచ్చారు. ఈ ఏడాది అక్టోబరు 13న ప్రపంచవ్యాప్తంగా సినిమాను విడుదల చేస్తున్నట్లు చెప్పేశారు. మరి ఈ సినిమాను తెరపైన చూడాలంటే మాత్రం ఇంకా మూడు నెలలు ఆగాల్సిందే.
ఇంకా ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ నటిస్తుండగా.. ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ భామ ‘ఒలివియా మోరిస్’ నటిస్తుంది. ఇక ముఖ్యమైన పాత్రల్లో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్, సముద్రఖని, రే స్టీవెన్సన్, ఆలిసన్ డూడి కూడా నటిస్తున్నారు. డీవీవీ ఎంటెర్టైన్మెంట్స్ పతాకం ఫై దానయ్య ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. మరి భారీ బడ్జెట్ తో భారీ అంచనాల మధ్య వస్తున్న ఈసినిమా ఈసారి ఎన్ని కొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూద్దాం..



[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: