హెచ్.వినోద్ దర్శకత్వంలోనే అజిత్ ప్రస్తుతం చేస్తున్న సినిమా వాలిమై. భారీ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ సినిమాను పాన్ ఇండియా లెవల్ లో రిలీజ్ చేయనున్నారు మేకర్స్ . ఇక ఈ సినిమా బైక్ రేసింగ్ నేపథ్యంలో సాగనుందని తెలుస్తుంది. ఇప్పటికే హైదరాబాద్ లో ఈ సినిమా చాలా వరకు చిత్రీకరణ జరుపుకోగా. కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్ కు బ్రేక్ పడింది. ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పట్టడంతో షూటింగ్ కు సిద్దమవుతుంది చిత్రయూనిట్.ఇక ఈసినిమా నుండి ఎంతో కాలంగా ఎలాంటి అప్ డేట్ లేని సంగతి తెలిసిందే కదా. అజిత్ బర్త్ డే కి అయినా ఫస్ట్ లుక్ వస్తుంది అనుకున్నారు కానీ అప్పుడు పరిస్థితులు బాలేకపోవడంతో రిలీజ్ చేయలేదు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తాజా సమాచారం ప్రకారం ఈసినిమా నుండి ఫస్ట్ లుక్ ను త్వరలోనే రిలీజ్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. అంతేకాదు ఫస్ట్ లుక్ తో పాటు మోషన్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేయనున్నట్టు సమాచారం. జులై సెకండ్ వీక్ లో ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేస్తారన్న టాక్ వినిపిస్తుంది. మరి దీనిపై అధికారిక ప్రకటన ఎప్పుడొస్తుందో చూడాలి..
ఇక యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాను ‘బేవ్యూ ప్రాజెక్ట్స్’ బ్యానర్ పై బోనీ కపూర్ నిర్మిస్తున్నాడు. ఇందులో కథానాయికగా బాలీవుడ్ నటి హుమా ఖురేషి నటిస్తుండగా… టాలీవుడ్ హీరో కార్తికేయ విలన్‌గా కనిపించనున్నారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నాడు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: